రికార్డులు, ప్రశంసలు బాలకృష్ణకు కొత్తేమి కాదు. ఇండస్ర్టీలోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఆయన నటనా, హావ భావాలతో ‘జై బాలయ్య’ అనిపించుకుంటున్నారు. ‘రికార్డు సెట్ చేయాలన్నా.. తిరగరాయాలన్నా మేమే’ అంటుంటారు బాలయ్య. అదేదో సినిమా డైలాగ్ కాదు. అది అక్షర సత్యమే అని నిరూపించుకుంటున్నారు కూడా బాలయ్య బాబు. బాలకృష్ణ నటనా ప్రస్థానంలో ఇప్పటి వరకూ 106 (అఖండతో కలిపి) చిత్రాల్లో నటించి మెప్పించారు. కెరీర్ ప్రారంభంలో తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించిన ఆయన తర్వాత హీరోగా అనేక చిత్రాల్లో నటించారు.
ఇప్పటి వరకూ 106 చిత్రాల్లో బాలయ్య బాబు
ఇప్పటి వరకూ ఆయన నటించిన 106 చిత్రాల్లో 72 సినిమాలు శతదినోత్సవాలు నిర్వహించుకున్నాయి. ఇలాంటి అరుదైన రికార్డు టాలీవుడ్ లో మరో హీరోకు కూడా దక్కలేదు. ఒక్క హీరో సినిమాలు అందునా 72 మూవీస్ శతదినోత్సవం జరుపుకోవడం ఈ ఘనత నిజంగా బాలయ్యకే సొంతం. ఇందులో రజతోత్సవ సినిమాలు, ఒకే థియేటర్ లో ఏకంగా 200 రోజులు ఆడినవి కొన్నయితే.. స్వర్ణోత్సవం, ప్లాటినం జూబ్లీ జరుపుకున్న చిత్రాలు మరికొన్ని ఉండడం విశేషం. బాలయ్య కెరీర్ లో అలా ఆడిన సినిమాల గురించి ఇక్కడ చూద్దాం.
ఒకే థియేటర్ లో రజతోత్సవం జరుపుకున్న చిత్రాలు
1:మంగమ్మ గారి మనుమడు.
2:ముద్దుల క్రిష్ణయ్య
3:సమరసింహా రెడ్డి
4:నరసింహ నాయుడు
5:సింహ
6:లెజండ్
7:అఖండ
ఈ సినిమాలన్నీ ఒకే థియేటర్ లో 200 రోజులు ప్రదర్శింపబడ్డాయి. వీటితో పాటు రాము, లారీ డ్రైవర్, కథానాయకుడు, రౌడీ ఇన్ స్పెక్టర్ తో పాటు మరో 10 సినిమాలు విడుదల వారీగా 25 వారాలు ఆడాయి.
ఒకే థియేటర్ లో 200 రోజులు ఆడినవి
1:ముద్దుల క్రిష్ణయ్య
2:నర్సింహా నాయుడు
3:సమరసింహా రెడ్డి
4:సింహా
5:లెజెండ్
స్వర్ణోత్సవం జరుపుకున్నవి
1:మంగమ్మగారి మనుమడు
2:ముద్దుల క్రిష్ణయ్య
3:ముద్దుల మామయ్య
4:సమరసింహా రెడ్డి
5:నరసింహా నాయుడు
6:లెజెండ్
ప్లాటినం జూబ్లీ జరుపుకున్నవి
1:మంగమ్మ గారి మనుమడు.
2:లెజెండ్.
ఫిలిం హిస్టరీలోనే అరుదైన రికార్డులు
-ఇండియన్ ఫలిం హిస్టరీలోనే 100 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమాగా ‘నరసింహా నాయుడు’ రికార్డులకు ఎక్కింది. ఇది 105 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శింపబడింది.
-ఇక లెజెండ్ విషయానికి వస్తే 400 రోజులు ఆడిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. రెండు కేంద్రాలలో డైమండ్ జూబ్లీ జరుపుకున్న ఫస్ట్ మూవీగా రికార్డులను సొంతం చేసుకుంది. ఈ మూవీ విడుదల వారీగా కలుపుకుంటే 1116 రోజులు ఆడింది. టాలీవుడ్ లో ఏ సినిమా కూడా ఇన్ని రోజులు ప్రదర్శనకు నిలవలేదు. ఇది ఆల్ టైం రికార్డు.
ఇలా విశ్లేషిస్తూ పోతే బాలయ్య బాబువి మరిన్ని రికార్డులు వెలికి వస్తాయి. ఫ్యాన్స్ ఫాలోయింగ్ లో కూడా ఆయనది రికార్డనే చెప్పాలి. ఇప్పటి వరకూ టాలీవుడ్ ఇండస్ర్టీలో ఏ సీనియర్ హీరోకి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయనకు ఉందని ఇటీవల కొన్ని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.