నరేశ్ ఇప్పటి వరకూ 3 పెళ్లిళ్లు చేసుకొని నాలుగో పెళ్లికి రెడీ అవుతున్నాడు. అయితే ఇప్పటి వరకూ తన ఇద్దరు భార్యల గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ పవిత్ర-నరేశ్ ను రెడ్ హ్యండెడ్ గా పట్టుకొని వారి గుట్టును బయటపెట్టిన రమ్య రఘుపతి గురించి మాత్రం అందరికీ తెలుసు. తన రెండో భార్య పేరు సుప్రయ ఆమె ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారట. ఆమె గురించి ఇప్పుడ చెప్పకునే ప్రయత్నం చేద్దాం.
గేయరచయిత మనుమరాలు
నరేశ్ రెండో భార్య పేరు రేఖ సుప్రియ. ఆమె ఎంతో ఉన్నత కుటుంబంలో జన్మించింది. చాలా ఆదర్శభావాలు ఉన్నది. గేయ చయిత, అభ్యుదయ వాది దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి మనుమరాలు, బుజ్జాయి రచయిత సుబ్బరాయ శర్మ కూతురు అంతా రచయితల ఫ్యామిలీ. అభ్యుదయ భావాల్లో వారంతా ఒక్కటిగా ఉండేవారు. కుటుంబంలోని అందరూ రచనలు చేసేవారు. ఆమె సోదరుడితో సహా.
అభ్యదయ భావాలున్న కుటుంబం
సుబ్బరాయ శర్మ (సుప్రియ తండ్రి) విజయ నిర్మల మంచి స్నేహితులు. నరేశ్ మొదటి సంబంధం విచ్చిన్నం అయిన సందర్భంలో ఆమె సుబ్బరాయ శర్మను తన కూతురిని కోడలిగా పంపించమని కోరింది. మొదట్లో ఆయన ఒప్పుకోలేదు. కానీ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన సమ్మతించారు. దీంతో నరేశ్-సుప్రియ ఒక్కటయ్యారు. సుప్రియకు మొదటి సంబంధమే అయినా నరేశ్ కు మాత్రం సుప్రియ రెండో భార్య. వారికి ఇద్దరు పిల్లలు నవీన్, తేజ కూడా పుట్టారు.
చిన్న కొడుకు విషయంలో గొడువలు
ఆ తర్వాత సుప్రియ నరేశ్ నుంచి విడిపోయింది. విడాకులు కూడా తీసుకుంది. దానికి కారణం చిన్న కొడుకు తేజ అన్నట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి. తేజ ఆటిజంతో జన్మించాడు. చిన్నతనం నుంచి బుద్ధి వికసించలేదు తేజకు. అన్ని పనులను దగ్గరుండి మరొకరు చూసుకోవాలి. దీంతో కుటుంబంలో గొడువలు రావడం ప్రారంభమైంది. నువ్వు చూసుకోవాలంటే.. నువ్వు చూసుకోవాలని ఇద్దరూ ఎప్పుడూ గొడవకు దిగుతుండడంతో అవి కాస్తా విడిపోయే వరకూ దారి తీశాయి.
విడాకుల వరకూ
చిన్న కొడుకును పట్టించుకోకుండా నవీన్ కస్టడీ కోరుతూ నరేశ్ కోర్టును ఆశ్రయించాడు. దీంతో నవీన్ ను కోర్టు నరేశ్ కు అప్పగించింది. ఈ నేపథ్యంలో చిన్న కొడుకు తేజ తల్లి సుప్రియ వద్దే ఉండిపోయాడు. ఆమెనే అతన్ని జాగ్రత్తగా చూసుకుంటూ పెంచింది.
25 మందిని దత్తత తీసుకున్న సుప్రియ
కొడుకును చూసి తల్లడిల్లిపోయే సుప్రియ ఇలాంటి ఆటిజం పెల్లల కోసం ఒక ఆర్గనైజేషన్ నడుపుతుంది. ఈ సంస్థ కింద ఆటిజంతో బాధపడే వారి తల్లిదండ్రులు, పిల్లలకు సూచనలు, సలహాలు ఇస్తుంది. దీంతో పాటు బుద్ధి మాంధ్యంతో ఉన్న 25 మందిని ఆమె దత్తత తీసుకుంది. వారి బాగోగులు చూస్తూనే వారికి మంచి చదువును కూడా అందిస్తున్నారు సుప్రియ.
మామూలు మనిషిగా మారిన తేజ
ఇక తేజ విషయానికి వస్తే మామూలు మనిషిగా మారిపోయాడు. ప్రస్తుతం ఆయన పనులు ఆయన చేసుకుంటు సాధారణ వ్యక్తిగా ఉన్నాడు. మంచి పేయింటర్ గా కూడా గుర్తింపు సంపాదించుకున్నాడు. అతని పేయింటింగ్స్ కు మార్కెట్లో మంచి రేటు ఉంది. లక్షల్లో అమ్మడు పోతున్నాయి. ఏది ఏమైనా ఇంత మంచి ఆదర్శ భావాలున్న వ్యక్తిని వదులుకున్నందుకు నరేశ్ ను అప్పట్లో చాలా మంది విమర్శించారు. ఇప్పుడు మూడో భార్యను కూడా వదిలిపెట్టేందుకు సిద్ధం అవుతున్న నరేశ్ ప్రవర్తనపై మండిపడుతున్నారు కూడా.