మోహన్‌బాబు నటించిన పొలిటికల్ సెటైర్ సినిమా ‘యం. ధర్మరాజు ఎం.ఏ’ సినిమాలో తన భార్య అయిన సుజాతను మెడబట్టి బయటకు గెంటమని అనురుడిచి చెపుతాడు మోహన్‌బాబు. సుజాత వెటకారంగా నవుతుంది. దాని మోహన్‌బాబు ‘‘ఏంటి నవుతున్నావ్’’ అంటాడు.
సుజాత ‘‘ఏం లేదు.. ఒకప్పుడు ఈ బంగ్లా లోపలకి కనీసం కాలు అయినా పెడదామని నవ్వు గేటు బయట అటు, ఇటూ తిరుగుతుంటే మా గుర్ఖా నిన్ను మెడబట్టి గెంటేవాడు. ఇప్పుడు అదే గుర్ఖాను పిలిచి నా మెడబట్టి గెంటమంటుంటే నవ్వొస్తోంది’’ అంటుంది.
అప్పుడు మోహన్‌బాబు ‘‘టైమమ్మా.. టైము’’ అంటాడు. ఏం చేసినా మన టైం బాగున్నంత వరకే అది ప్లస్.. టైం బ్యాడ్ అయితే అంతా మైనస్సే..
ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్‌కి టైం బ్యాడ్ నడుస్తున్నట్టు ఉంది. ఇప్పటికే వలసలు, రాజీనామాలతో టెన్షన్‌లో ఉన్న ఆపార్టీని ఆశలు పెట్టుకున్న సినిమాలు కూడా మోసం చేస్తున్నాయి. విపక్షాలను విలన్‌లుగా చూపిస్తూ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మతో రూపొందించిన ‘వ్యూహం’ కోర్టు కేసులతో అటకెక్కింది.
ఏకంగా ఈ సినిమా సెన్సార్ సర్టిఫికెట్‌ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. దీంతో వైసీపీ పార్టీ కొంత ఢీలా పడిరది. సరే వ్యూహం బెడిసి కొడితే కొట్టిందిలే.. మనకు ‘యాత్ర`2’ ఉందిలే అనుకుని ధైర్యంగా ఉన్న వారికి ఇప్పుడు ‘యాత్ర`2’ కూడా హ్యాండిచ్చేలా ఉంది.
2019 ఎన్నికలే లక్ష్యంగా మహి వి. రాఘవ దర్శకత్వంలో 70 ఎంఎం స్క్రీన్స్ పతాకంపై గతంలో వైయస్సార్ చరిత్రలోని కొంత భాగాన్ని తీసుకుని ‘యాత్ర’ పేరుతో ఓ సినిమా రూపొందించారు. అది మంచి విజయం సాధించడంతో వైసీపీకి ఆ ఎన్నికల్లో ఈ సినిమా కూడా ఉపయోగపడిరది.
మళ్ళీ 2024 ఎన్నికల లక్ష్యంతో జగన్‌మోహన్‌రెడ్డి పాత్రను హైలైట్ చేస్తూ ఇదే సంస్థ.. ఇదే దర్శకుడితో ‘యాత్ర`2’ తీసింది. ఫిబ్రవరి 8న విడుదల డేట్ ప్రకటించింది. అయితే ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ ఈ చిత్రానికి ఇప్పుడు సెన్సార్ చేయకూడదని ఓ వివాదాన్ని లేవనెత్తారు.
విపక్షనాయకలు అయిన చంద్రబాబు, కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీల వేషధారణతో ఉన్న వ్యక్తుల పాత్రల ద్వారా ఆయా నాయకులను కించపరిచేలా సినిమాలో సీన్‌లు ఉన్నాయని, ఈ విషయం ట్రైలర్‌లో కనిపిస్తోందని, కాబట్టి ఈ చిత్రం సెన్సార్‌ను ఎన్నికల తర్వాత మాత్రమే నిర్వహించాలని సెన్సార్ బోర్డ్‌కు లెటర్ రాశారు.
ఇదే అంశంపై టీడీపీ, కాంగ్రెస్‌లు కూడా ఫిర్యాదులు చేస్తే ‘యాత్ర`2’ విడుదలపై నీలినీడలు కమ్ముకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చూడాలి యాత్ర`2 ఎన్నికల ముందు తెరమీదికి వస్తుందో.. లేదో.