టాలీవుడ్ ఇండస్ర్టీలోని కథానాయికల గురించి తెలుసుకోవాలంటే సౌందర్య గురించి తప్పకుండా తెలుసుకోవాలి. అలనాటి నటి సావిత్రీ అంతటి గుర్తింపును అనతి కాలంలోనే సంపాదించుకున్నారు సౌందర్య. ఫ్యామిలీ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉన్నారు. ఇక ఎక్స్ పోజింగ్ అనేదే దరికి కూడా రానివ్వలేదు. ఇండస్ర్టీకి ఎన్నో హిట్లు ఇచ్చిన సౌందర్య తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ ఇండస్ర్టీలలో తనదైన ముద్ర వేశారు.
ఫ్యామిలీ ఉమెన్ గా పిలుచుకునే ఆమెకు అభిమానులు కోకొల్లలనే చెప్పాలి. అంతటి అభిమానులను తన కుటుంబంగా చెప్పుకునేవారు ఆమె. ఒక తారకు ఉండాల్సిన అందం ఆమెకు ఉండేనే ఉంది. ఇక అభినయం అంటే సావిత్రీ కంటే మించిపోయిందని ఒక దశలో చాలా మంది హీరోలు, దర్శకులు కూడా చెప్పేవారు.
కోటేశ్వర్ రావు చెప్పిన మాటలు
సౌందర్య ఈ లోకాన్ని విడిచి 17 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. కానీ అభిమానుల గుండెల్లో మాత్రం ఆమె చిరస్థాయిగా నిలిచిపోయిందనే చెప్పాలి. ఇండస్ర్టీకి ఆమె మరణం తీరని లోటనే చెప్పాలి. ఆమె హెలీకాప్టర్ ప్రమాదంలో మరణించిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఈ ప్రమాదానికి ముందు ఆమె ఎన్నో ప్రమాదాల నుంచి బయటపడ్డారట.
ఈ విషయాన్ని ఒక సీనియర్ నటుడు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో వివరించాడు. ఆయన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఆ నటుడు ఎవరో కాదు మానవ కోటేశ్వర్ రావు ఆయనను ఒక ఇంటర్వ్యూవర్ సౌందర్య గురించి అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ ప్రమాదాల గురించి చెప్పారు.
అతిపెద్ద ప్రమాదం నుంచి బయటపడింది సౌందర్య
‘శివ శంకర్’ సినిమా షూటింగ్ సమయంలో ఒక పెద్ద ప్రమాదం నుంచి సౌందర్య తప్పించుకున్నారు. షూటింగ్ లో విరామం సమయంలో సౌందర్య ఒక ప్లేస్ లో కూర్చున్నారు. కాసేపటికి ఒక వ్యక్తి కింద పడిపోయారు. పెద్ద శబ్ధం కూడా వచ్చింది. దాదాపు 15 అడుగుల ఎత్తు నుంచి మీమంతా సౌందర్యే కావచ్చని పరుగు పరుగున వెళ్లి చూశాం కానీ ఆమె కాదు.
సౌందర్య కూర్చున్న కుర్చిలో ఆమె వెళ్లిన తర్వాత ఒక సెట్ బాయ్ కూర్చున్నాడు. ఈ ప్రమాదం నుంచి ఆమె తృటిలో తప్పించుకుంది. ఆ వ్యక్తిని హాస్పిటల్ కు తరలించడం అంతా అయిపోయింది. కానీ ఆ ప్లేస్ నుంచి సౌందర్య గనుక పడి ఉంటే.. మా ఊహకే అందలేదు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
చిరికి హెలీకాప్టర్ దుర్ఘటనలో
ఇలాంటి సంఘటనలను సౌందర్య చాలా ఫేస్ చేసింది. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకస్తుందో ఎవరికి తెలుసు. ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించుకున్న ఆమె హెలీకాప్టర్ కూలి మరణించింది. ఆమె మరణం తర్వాత చిత్ర పరిశ్రమ చాలా చింతించింది. ఇండస్ర్టీకి తీరని లోటనే చెప్పాలి. ఆ కాలంలో ఆమె లాంటి నటన ఎవరూ చేయలేకపోయారు. సౌందర్య కోసం థియేటర్లకు వచ్చిన వారిని ఎందరినో చూశాం అప్పుడు. మా చిన్న తనంలో సావిత్రీ గారికి ఆ క్రేజ్ ఉండేది ఆ తర్వాత సౌందర్యనే దాన్ని దక్కించుకోగలిగింది. ఇప్పుడు కోటేశ్వర్ రావు మాటలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.