పవర్ స్టార్ హీరోగా వస్తున్న లెటెస్ట్ మూవీ ‘హరి హర వీరమల్లు’. ఈ చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో వారియర్ లుక్ లో కనిపించబోతున్నాడు పవన్ కళ్యాణ్. ఈ మూవీ షూటింగ్ కొన్ని నెలలుగా ఆగిపోయింది. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండడం, ఇటీవల ఆయనకు చిన్నపాటి హెల్త్ సమస్యలు రావడంతో షూటింగ్ నిలిపివేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు మళ్లీ సెట్స్ పైకి వెళ్లింది. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు క్రిష్. ఇంత వరకూ పాన్ ఇండియా లెవల్ లో పవన్ కళ్యాణ్ ఎలాంటి మూవీ చేయలేదు. ఈ సినిమా అదే స్థాయిలో ఉండబోతోందని క్రిష్ వివరించాడు.
భారీ బడ్జెట్ తో
ఇప్పటికే 60 శాతం మేర షూటింగ్ పూర్తయిందని చిత్ర యూనిట్ తెలియజేసింది. ఇందులో ఒక యాక్షన్ సీక్వెల్ కోసం రూ. 8 నుంచి రూ. 10 కోట్ల వరకు వెచ్చిస్తున్నారంటే ఈ మూవీ ఎంత భారీ బడ్జెట్ తో ఉండబోతుందో తెలుస్తోంది. ఈ యాక్షన్ సీక్వెల్ కు సంబంధించి ఇటీవల సోషల్ మీడియా వేదికపై రిలీజైన్ పిక్స్ బాగా వైరల్ అయ్యాయి. హరి హర వీరమల్లును 29 ఏప్రిల్, 2023న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
భారీ ధరకు ఆడియో రైట్స్
‘శ్రీ సూర్య మూవీస్’ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ లో ఏఎం రత్నం ‘హరి హర వీరమల్లు’ను మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ మూవీలో పవన్ వజ్రాల దొంగగా కనిపించబోతున్నాడు. పవన్ కళ్యాన్ సరసన నిధి అగర్వాల్ చేయగా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీరవాణి అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఆడియో హక్కులను కూడా ఇటీవల ‘టిప్స్’ సొంతం చేసుకుందని తెలుస్తుంది. భారీ ధరకు ఆడియో రైట్స్ ను దక్కించుకున్నట్లు టాక్ ఉంది.
డైరెక్టర్ సురేందర్ రెడ్డి అఖిల్ అక్కినేనితో
దీంతో పాటు పవర్ స్టార్ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబోలో మరో మూవీ చేస్తున్నారు. దీనికి సంబంధించి గతంలోనే అధికారిక ప్రకటన వచ్చింది. ఇది మధ్యలోనే ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉండడంతో ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఉండబోదనే న్యూస్ వైరల్ కావడంతో.. అలాంటిది ఏమీ లేదని మూవీని పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రొడ్యూసర్ ఎస్ఆర్‌టీ ఎంటర్ టైన్ మెంట్ అధినేత తాళ్లూరి రాం ప్రకటించారు. ఈ ప్రాజెక్టు తప్పకుండా ముందుకు వెళ్తుందని ట్విటర్ వేదికగా చెప్పాడు. ప్రస్తుతం డైరెక్టర్ సురేందర్ రెడ్డి అఖిల్ అక్కినేనితో ఓ మూవీ తీస్తున్నారని దీని తర్వాత పవన్ కళ్యాణ్ మూవీ కొనసాగుతుందని రాం చెప్పారు. దీనికి వక్కంతం వంశీ స్క్రిప్ట్ అందించారు.
దీని కోసం పవన్ 20 డేస్
వీటితో పాటు తమిళ మూవీ ‘వినోదయ సీతం’ రీమేక్ లో కూడా నటించబోతున్నారు పవన్ కళ్యాణ్. దీని కోసం పవన్ 20 డేస్ కేటాయించారట. ఈ మూవీకి సముద్రకని డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. స్ర్కిప్ట్ వర్క్ త్రివిక్రమ్ చూసుకుంటున్నారట. ఇందులో పవన్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కీలక పాత్రలో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ‘తేరి’ రీమేక్ లో కూడా పవన్ నటించోతున్నారట. దీనికి సాహో డైరెక్టర్ సుజీత్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారని టాలీవుడ్ పేర్కొంటుంది. అయితే 2024 ఎలక్షన్స్ కు దాదాపుగా 20 నెలలు మాత్రమే ఉండడంతో ఈ రెండు రీమేక్ ప్రాజెక్టుల్లో నటించే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తోంది వపన్ కళ్యాణ్.