రీసెంట్ గా జనసేన పార్టీ లో ప్రముఖుల చేరికలు ఎక్కువయ్యాయి. ఇది ఆ పార్టీ ని బలోపేతం చెయ్యడమే కాకుండా , జనసేన పార్టీ కార్యకర్తల్లో నూతనోత్సాహం ని నింపింది.
ఇటీవలే మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం లో వైజాగ్ వైసీపీ ఎంఎల్సీ వంశీ కృష్ణ పవన్ కళ్యాణ్ సమక్షం లో చేరాడు. గతం లో ఈయన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ ద్వారా వైజాగ్ లో పోటీ చేసి అతి స్వల్ప మెజారిటీ తో ఓడిపోయాడు.
ఇప్పుడు మళ్ళీ జనసేనలోకి రావడం నా ఇంటికి తిరిగి వచ్చినట్టే అనిపిస్తుంది అంటూ కామెంట్స్ చేసాడు. వైజాగ్ లో వైసీపీ కి వంశీ కృష్ణ వెన్నుముక లాంటి వాడు.
ఆయన ఆ పార్టీ ని ఎంతో బలోపేతం చేసాడు, అంతే కాకుండా సీఎం జగన్ కూడా వంశీ కృష్ణ ని ఎంతో గౌరవించేవాడు. అందుకే ఆయనకీ పిలిచి మరీ ఎంఎల్సీ పదవి ని ఇచ్చాడు సీఎం జగన్.
మనం బాగా గమనిస్తే వంశీ కృష్ణ జనసేన పార్టీ లో చేరినప్పుడు సీఎం జగన్ ని పల్లెత్తి ఒక్క మాట కూడా అనలేదు. తనని పార్టీలో బాగానే చూసుకున్నారని, కావాల్సిన సీట్ రాకపోవడం వల్ల, పవన్ కళ్యాణ్ ఆ సీట్ నుండి పోటీ చేయిస్తానని మాట ఇవ్వడం వల్లే జనసేన పార్టీ లో చేరాను అంటూ చెప్పుకొచ్చాడు.
వైసీపీ పట్ల అంత సాఫ్ట్ గా మాట్లాడడం పవన్ కళ్యాణ్ కి అసలు నచ్చలేదట. దీంతో ఆయనకీ కోపం వచ్చి ‘నువ్వు మా పార్టీ లోకి చేరి వైసీపీ ని పొగిడితే ఎలా’ అని వంశీ ని మందలించినట్టుగా రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగింది.
రీసెంట్ వంశీ కృష్ణ జగన్ ని నిందిస్తూ 11 పేజీల ఉత్తరం రాసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తరం పవన్ కళ్యాణ్ బలవంతం చెయ్యడం వల్లే రాయాల్సి వచ్చిందట.
పొత్తులో బంగారం లాంటి సీట్ వస్తుంది, గెలుపు అవకాశాలు అత్యధికంగా ఉన్నాయి, అధినేత చెప్పినట్టు వినకపోతే నాకే నష్టం అని బయపడి , జగన్ ని విమర్శించడం ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా రాయాల్సి వచ్చిందని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్.
మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో అనేది చూడాలి. ఇక పోతే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కాకినాడ టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ జనసేన ముఖ్య నేతలతో మూడు రోజుల నుండి చర్చలు జరుపుతున్నాడు.