నరేశ్, పవిత్రా లోకేశ్ వ్యవహారం రోజు రోజుకూ కొత్త మలుపులు తిరుగుతూనే ఉంది. వీరు ఏడాది క్రితం హోటల్ గదిలో దొరికిన తర్వాత నుంచి డిసెంబర్ 31న రిలీజైన లిప్ లాక్ వీడియో వరకూ ఈ జంట తెగ ట్రెండింగ్ లో ఉన్నారు. ఈ మధ్య నరేశ్ గురించి ఆయన మూడో భార్య రమ్య రఘుపతి సంచలన విషయాలు చెప్పింది. నరేశ్ కు విడాకులు ఇచ్చేదే లేదని తేల్చి చెప్పింది.
ఇద్దరినీ కలిసి ఉండనిచ్చేది లేదని చేప్తూనే తనపై నరేశ్ ఎంత టార్చర్ చేశారనే విషయాలను కూడా వివరించింది. ఇవన్నీ పక్కన పెడితే సీనియర్ నటుడు నరేశ్ గురించి ఆయనతో కొన్ని సినిమాలలో నటించిన నటి పూజిత కొన్ని విషయాలను తెలిపింది. ఇవి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.
మంచి వ్యక్తి నరేశ్
‘ఆర్టిస్టులకు బాగా గౌరవం ఇచ్చే వారు నరేశ్. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా చూసుకునేవారు నాకు ఒకసారి చాలా హెల్ప్ చేశారు. ఒకానొక సమయంలో నాకు సహాయం కావాలని అందుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లెటర్ కోసం వెళ్లాను. ఆ టైంలో నాకు ఎవ్వరూ సాయం చేయలేదు. ఆ టైంలో రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆయనతో పాటు శివాజీ రాజా జనరల్ సెక్రెటరీగా కొనసాగుతున్నారు. వీరిద్దరూ కూడా ఎలాంటి సాయం చేయలేదు. కలిసి కొన్ని సినిమాల్లో నటించినా రాజేంద్ర ప్రసాద్ మాత్రం నీనెవరో అన్నట్లుగా చూశారు. తనతో మూడు, నాలుగు సినిమాల్లో నటించానని పరిచయం చేసుకున్నా ఆయన స్పందించలేదు.
కనీసం ప్రెసిడెంట్ పట్టించుకోలేదు
అప్పట్లో నేను ఈసీ మెంబర్ గా ఉన్న సమయంలో రాజేంద్ర ప్రసాద్ కూడా ఈసీ మెంబరే. కానీ ఆయన ప్రవర్తన ఆ సమయంలో నాకు వింతగా అనిపించింది. ప్రసిడెంట్ అయినంత మాత్రాన అలా ప్రవర్తించాలా..? అందరం చిత్ర సీమ ఒడిలోని వారిమే కదా సాయం కోసం వస్తే స్పందించాలి కానీ ఇలా చేయడం కరెక్టు కాదనిపించింది. నాకు ఇలా సాయం కోసం బతిమిలాడడం ఇష్టం ఉండదు. గంట సేపు వరకూ వెయిట్ చేసి ఎవరూ పట్టించుకోకపోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోయా. మనం ఓట్లు వేస్తేనే కుర్చీలో కూర్చునే వారు మనలను చులకనగా చూడడం నాకు నచ్చలేదు.
నరేశ్ ఆదుకున్నారు
ఇక ఎవ్వరూ తనను పట్టించుకోరు అనుకున్న సమయంలో నరేశ్ నాకు అండగా నిలుచుకున్నారు. నాకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఆయనది మంచి వ్యక్తిత్వం. ఇండస్ట్రీలో కూడా మంచి గుర్తింపు ఉన్న నటుడు ఆయన ఇన్నీ ఉన్నా ఆయన ఒక శని గ్రహాన్ని నెత్తిన పెట్టుకున్నారు. ఆ ఒక్క చెడు విషయం తప్ప ఆయనలో అన్నీ మంచి క్వాలిటీలే ఉన్నాయి. మా అసోసికయేషన్ సభ్యులకు కళ్యాణ లక్ష్మి, పింఛన్ లాంటి పథకాలను తీసుకచ్చింది నరేశే. నేను బతికున్నంత కాలం మంచి ఫ్రెండ్ లా ఉంటాను.’ అంటూ నరేశ్ గురించి పూజిత వివరించింది.