పవర్ స్టార్ వల్లే నా కుటుంబం రోడ్డున పడింది

0
1216

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ హీరోకే కాదు ఈ పేరుకు కూడా అభిమానులు ఎక్కువనే చెప్పాలి. మెగాస్టర్ తమ్ముడిగా పరిచమైనా తక్కువ కాలంలోనే అన్ననే మించి పోయడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈయన ఫాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫ్యాన్స్ అనేకంటే భక్తులు అనాలేమో.. అంతగా అభిమానులను పెంచుకున్నారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు వరుస బెట్టి సినిమాలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇక ఆయన రాజకీయంగా కూడా రాణిస్తూ ఏపీలో చక్రం తిప్పుతున్నారనే చెప్పాలి. ఈయన అభిమానుల్లో పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా ఉండడం విశేషం.

ఫస్డ్ డే ఫస్ట్ షో చూడాల్సిందే

ఇక మన హీరో సినిమా ఫస్డ్ డే ఫస్ట్ షో చూడకుంటే లైఫ్ వేస్ట్ అనుకునే వారు కూడా లేకపోలేదు. ఎన్ని పనులు ఉన్నా.. ఆఫీసులకు సైతం డుమ్మా కొట్టి మరీ సినిమా చూడాల్సిందే. ఇలాంటి పనులు చేసి ఉద్యోగాలు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. ఇలా ఆస్తులను అమ్మి మరీ తమ అభిమాన హీరో కోసం కటౌట్లు, థియేటర్లును సుందరంగా తీర్చిదిద్దేంతుకు ఖర్చు పెడుతుంటారు.

ఇలాంటి అభిమానుల కోవలోకే వస్తుంది అషురెడ్డి. వర్మను సైతం పిచ్చెక్కించేసిన అషూరెడ్డి బిగ్ బాస్ షోలో కూడా సందడి చేసింది. ఆమె ఇండస్ట్రీలోకి రాక ముందు జాబ్ చేసేదంట. టిక్ టాక్ వీడియోలు, డబ్ ష్మాస్ వీడియోలు చేసుకుంటూ ఆమె సోషల్ మీడియాలో ఫేమ్ సంపాదించుకుంది. ఆ తర్వాత మెల్ల మెల్లగా ఇండస్ట్రీ వైపు అడుగులు వేస్తూ సినిమాలలో అవకాశాలు దక్కించుకుంది.

డిఫరెంట్ గా లీవ్ మెయిల్ చేసిన అషురెడ్డి

సంచలనాల డైరెక్టర్ ఆర్జీవీతో ఇప్పటి వరకూ అమ్మడు రెండు సార్లు బోల్డ్ ఇంటర్వ్యూలు చేసింది. థైస్, బికినీ ఇలాంటి అనేక పిక్స్ సోషల్ మీడియా వేదికగా తన ఇన్ స్టాలో అప్ లోడ్ చేస్తూ కుర్రకారును పిచ్చిక్కిస్తుంది ఈ అమ్మడు. ఈమెకు ఇండస్ట్రీ గురించి తెలిసిన తర్వాత మొదటి అభిమాని పవన్ కళ్యాణ్ అట. ఆయనపై ఉన్న అభిమానమే పిచ్చిగా మారి చేసే జాబ్ ను సైతం వద్దనుకుందట. అషురెడ్డి యూఎస్ లోని డల్లాస్ లో ఒక కంపెనీలో జాబ్ చేస్తుంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కాటమరాయుడు రిలీజ్ అయ్యిందట. ఆ సినిమా చూడాలని మేనేజర్ ను సెలవు అడిగిందట.

దయుంచి సెలవు ఇవ్వండి

ఆమె లీవ్ కోసం ఎలా మెయిల్ పెట్టిందంటే.. ‘సార్ నేను మంగళవారం ఆఫీస్ కు రావచ్చూ.. రాకపోవచ్చూ.. ఆ రోజు నా అభిమాన హీరో పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవుతుంది. నా అభిమాన హీరో సినిమా ఫస్డ్ డే ఫస్ట్ షో చూడకుంటే చాలా అవమానంగా భావిస్తాను. దీన్ని మీరు అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. దయుంచి సెలవు ఇవ్వండి. మీరు సెలవు ఇచ్చినా.. ఇవ్వక పోయినా సినిమాకు వెళ్లడం మాత్రం ఖాయం. నన్ను ఉద్యోగంలో ఉంచినా.. తీసివేసినా నేను ఏమనుకోను. కానీ నాలాంటి ఒక టాలెంట్ పర్సన్ ను తొలగిస్తారని నేను అనుకోను. ఇక మీ ఇష్టం’ అంటూ మేయిల్ చేసింది. దీనికి ‘మూవీ ఫీవర్’ అనే సబ్జెక్టును కూడా యాడ్ చేసింది.

నెటిజన్ల భిన్నాభిప్రాయాలు

ఈ మేయిల్ చూసిన మేనేజర్ ఆమెను జాబ్ నుంచి తొలగించేడు సదరు మేనేజర్. కానీ ఆమె మాత్రం ఫీల్ కాలేదు. తన ఫ్యామిలీకి అషూరెడ్డి ఉద్యోగమే ఆధారం కానీ ఆమె అవేవీ పట్టించుకోకుండా. కేవలం ఫస్డ్ డే ఫస్ట్ షో చేసేందుకు ఉద్యోగాన్ని పణంగా పెట్టింది. ఉద్యోగం పోయింది కాబట్టి అవకాశాల కోసం ఇండస్ట్రీ వైపు వచ్చాను. లేదంటే ఉద్యోగం చేస్తూనే బోర్ లైఫ్ అనుభవిస్తుండేదాన్ని అంటూ చెప్పుకచ్చింది. ఈ విషయం ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె పిచ్చిపై నెటిజన్లు డిఫరెంట్ గా స్పందిస్తున్నారు. ఇంత పిచ్చి పనికిరాదని సూచనలు చేస్తున్నారు. కేవలం అభిమానం కోసం కుటుంబాన్ని రోడ్డున పడేశావు అంటూ మండిపడుతున్నారు.