యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ని టాలీవుడ్ లో అందరూ డార్లింగ్ అని పిలుస్తూ ఉంటారు. ఎంత ఎదిగిన ఒదిగి ఉంటే తత్త్వం, ఉదారస్వభావం , అందరితో కలిసిపోయే తత్త్వం ఇవన్నీ ప్రభాస్ ని రియల్ హీరోగా నిలిపాయి.
ఇవన్నీ ఆయనకీ తన పెదనాన్న కృష్ణం రాజు నుండి అలవాటుగా వచ్చింది. కృష్ణం రాజు తన ఇంటికి శత్రువు వచ్చినా కూడా కడుపునిండా భోజనం పెట్టకుండా పంపేవాడు కాదు. ఆ అలవాటు ప్రభాస్ కి కూడా వచ్చింది.
‘సలార్’ వెయ్యి కోట్లు అందుకోవడం అసాధ్యమేనా.
ప్రభాస్ ని కలిసిన అభిమానులు అయినా, తోటి నటీనటులు అయినా చెప్పేది ఒక్కటే మాట..డార్లింగ్ ప్రభాస్ ప్రేమతో చంపేస్తాడు, ఫుడ్ పెట్టి చంపేస్తాడు అంటూ సరదాగా కామెంట్స్ చేస్తూ ఉంటారు.
ఈ ఏడాది కృష్ణం రాజు చనిపోయినప్పుడు మొగళ్తూరు ప్రాంతం మొత్తానికి దినం భోజనాలు పెట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే. దేశం లో ఉన్న వంటకాలు మొత్తాన్ని అభిమానులకు పెట్టించాడు ఆయన.
ఇదంతా పక్కన పెడితే ప్రభాస్ షూటింగ్ లొకేషన్స్ లో ఉన్నప్పుడు సెట్స్ లో ఉన్న వాళ్లందరికీ ప్రతీ రోజు ఫుడ్ పార్టీ నే ఉంటుందట. రకరకాల వంటకాలను వడ్డించి, కొత్త రుచులను పరిచయం చేసేవాడట.
కేవలం ఒక్క పూట డిన్నర్ కి ఆయన రెండు నుండి మూడు లక్షల రూపాయిలు ఖర్చు చేస్తాడంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆయన ఒంటరిగా ఎప్పుడు తినడు. తనతో పాటు కనీసం పది మంది అయినా ఉండాల్సిందే. లేకపోతే ముద్ద ముట్టడు అని అందరూ అంటుంటారు.
‘సలార్’ మూవీ షూటింగ్ సమయం లో కేవలం శృతి హాసన్ కోసం 20 రకాల వంటలను చేయించి తీసుకొచ్చాడంటే ఆయన ఫుడ్ కోసం ఏ రేంజ్ లో ఖర్చు చేస్తాడో అర్థం చేసుకోవచ్చు.
ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ప్రభాస్ సలార్ విషయానికి వస్తే , రీసెంట్ గానే విడుదలై సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పటి వరకు 400 కోట్ల రూపాయిల గ్రాస్ ని సొంతం చేసుకుంది.
న్యూ ఇయర్ లోపు ఈ చిత్రం కచ్చితంగా వెయ్యి కోట్ల రూపాయిలను అందుకునే దిశగా పరుగులు తీస్తుందని అభిమానులు బలంగా నమ్ముతున్నారు. మరి అది జరుగుతుందో లేదో చూడాలి.