బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమాపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ఈ సినిమాపై తాజాగా చిలుకూరి బాలాజీ గుడి పూజారి రంగరాజన్ ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపించారు. ఈ రోజుల్లో ధర్మానికి ఎంత నష్టం జరుగుతుందో ప్రత్యక్షంగా అఖండ సినిమాలో చూపించారని అన్నారు. ఆ ధర్మాన్ని రక్షించడం కోసం మనం అందరం కలసి పోరాడిల్సిన సమయం వచ్చిందని అన్నారు. అహింసా ప్రదామోధర్మః అనే వాఖ్యాన్ని మనకు వ్యతిరేకంగా ఎలా దుర్వినియోగ పరుస్తున్నారో చూపించడం జరిగిందని చెప్పారు.
ధర్మాన్ని రక్షించడం కోసం మనం ఎంతకైనా తెగించవచ్చు అనే సిద్ధాంతాన్ని స్పష్టంగా చూపించడం జరిగిందని తెలిపారు. బోయపాటి శీను గారికి, బాలకృష్ణ గారికి, వారి టెక్నీషియన్ బృందానికి పేరు పేరునా భగవంతుడి అనుగ్రహం ఉండాలని కోరుకున్నారు. ధర్మానికి ఇబ్బంది జరుగుతుందని ప్రజల మనస్సులో ఎంతో ఉక్రోషం, ఆక్రోశం, కోపం ఉందని.. అందుకే ఈ సినిమాని ఇంతమంది చూస్తున్నారని అన్నారు. రామరాజ్యం స్థాపన జరగాలని అందరి మనసులో కోరిక ఉందని అన్నారు.
కానీ ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని చెప్పారు. అందుకే ఈ సినిమా సూపర్ హిట్ అయిందని అన్నారు. ఇప్పటికైనా పాలకులు గుర్తించాలని కోరారు. రామరాజ్యం అనేది ప్రధమ సిద్ధాంతమని, అందులో మార్పులు చేయకపోయినా యధాతదా పాటించాలని కోరారు. ధర్మమే మన ప్రధమ సిద్ధాంతమని.. అది గుర్థించిన ప్రజలందరికీ కూడా రంగరాజన్ అభినందనలు తెలిపారు.