తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి రేవంత్ రెడ్డి తనదైన మార్కు తో పాలన చేస్తూ ఇండియా లోనే బెస్ట్ సీఎం అనిపించుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. ప్రతీ రాష్ట్రం లోనూ దుబారా ఖర్చులు ఇష్టమొచ్చినట్టు చేస్తుంటారు ముఖ్యమంత్రులు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం సాధ్యమైనంత వరకు దుబారా ఖర్చులకు పోకుండా, చాలా పొదుపుగా, ప్రతీ పైసా ప్రజా సంక్షేమం కోసమే ఉపయోగించాలని ఉద్దేశ్యంతో ముందుకు పోతున్నాడు.
అందులో భాగంగా తనకు వస్తున్నా లగ్జరీ ని కూడా వదులుకుంటున్నాడు. ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేకమైన బులెట్ ప్రూఫ్ వాహనం, మరియు భారీ కాన్వాయ్ ఉండడం సహజం. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పటికీ తన సొంత కారుని మాత్రమే ఉపయోగిస్తున్నారు. బులెట్ ప్రూఫ్ కార్ లో మిమల్ని తీసుకెళ్లడం మా బాధ్యత అని సెక్యూరిటీ చెప్పగా, నా కారుకే బులెట్ ప్రూఫ్ గ్లాస్లు వెయ్యండి అని అన్నాడట.
మెట్రో రైల్ విస్తరణకు రేవంత్ రెడ్డి బ్రేక్!
ఇకపోతే ఢిల్లీ నుండి ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి కోసం వంటకాలను తెప్పించాడట ఆయన వంట మనిషి. ఈ విషయం తెలుసుకున్న రేవంత్ రెడ్డి చాలా కోపం తో ఇలా అయితే నిన్ను ఉద్యోగం నుండి పీకేస్తాను. ఇన్ని రోజులు ఎలా అయితే నాకు వంట చేసి పెట్టావో, అలాగే చెయ్యి, స్పెషల్ ట్రీట్మెంట్ అవసరం లేదు అని అన్నాడట. ఇది ఇలా ఉండగా తన కాన్వాయ్ విషయం లో కూడా రేవంత్ రెడ్డి కొన్ని మార్పులు చేసాడట.
కాన్వాయ్ లో ఇన్ని కార్లు అవసరం లేదు, నాలుగు కార్లు ఉంటే చాలు అని తన సెక్యూరిటీ తో అన్నాడట. ఇంతకు ముందు ప్రగతి భవన్ అని పిలిచిన ఆఫీస్ ని ఇప్పుడు ప్రజా భవన్ గా మార్చాడు. సామాన్యులకు కూడా ఎప్పుడు వీలు అయితే అప్పుడు ఎలాంటి అనుమతి అవసరం లేకుండా సమస్యలు నేరుగా సీఎం తో చెప్పుకునే వెసులుబాటు ఈ ప్రజా భవన్ ద్వారా కల్పించాడు రేవంత్ రెడ్డి.
ప్రగతి భవన్ లో ఇంతకు ముందు సీఎం క్యాంప్ ఆఫీస్ ఉండేది, అది ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి కి కేటాయించాడు. సీఎం క్యాంప్ ఆఫీస్ జూబ్లీ హిల్స్ లోని మర్రి చెన్నా రెడ్డి మానవ వనరుల కేంద్రం లో ఏర్పాటు చేయబోతున్నారట. ఈ క్యాంప్ ఆఫీస్ కూడా పెద్ద ఖర్చు లేకుండా కేవలం ఒక షెడ్డు లాగ ఉంటే చాలని అధికారులకు చెప్పాడట రేవంత్ రెడ్డి. ఇలా తన మార్కు పాలనతో ప్రజల్లో రోజు రోజుకి అశేష ఆదరణ దక్కించుకుంటున్నాడు రేవంత్ రెడ్డి.