హెలికాప్టర్ లో తిరిగిన ఏకైక IAS అధికారి స్మిత

0
291
smitha sabharwal akunuri murali

ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌ను ఉద్దేశించి మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి రీసెంట్ గా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా హాట్ టాపిక్ గా మారింది. దేశంలో హెలికాప్టర్‌లో వెళ్లి పనులను పర్యవేక్షించే ఏకైక ఐఏఎస్ అధికారి ఈమె గారే అంటూ వ్యంగ్యంగా ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశారు. స్మితా సబర్వాల్‌ లాంటి వ్యక్తులు కేంద్ర సర్వీసులకు అనర్హులు అని, వారిని అక్కడికి వెళ్లకుండా అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ని కోరారు.

గత ప్రభుత్వంలో సీఎంవో అదనపు కార్యదర్శిగా, సాగునీటి శాఖ కార్యదర్శిగా విధులు నిర్వహించింది స్మితా సబర్వాల్. ప్రభుత్వం కోసం పని చేసే ఆమె రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కలవకపోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ కి దారి తీసింది.

smitha sabharwal akunuri murali

మెట్రో రైల్ విస్తరణకు రేవంత్ రెడ్డి బ్రేక్

మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి ఇంకా మాట్లాడుతూ చేసినవన్నీ చేసి కొత్త ప్రభుత్వం రాగానే కేంద్ర సర్వీసులకు వెళ్లే ఐఏఎస్ అధికారులను పంపకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తప్పులు ఏమి చెయ్యకపోతే భుజాలు తడుముకోడం ఎందుకని ఆయన ప్రశ్నించారు. అప్పటి ప్రభుత్వంలో అవకతవకలు చేసి కొత్త ప్రభుత్వం రాగానే కేంద్ర ప్రభుత్వానికి వెళ్లి, అక్కడి నెట్‌వర్క్స్‌ను వాడుకొని, ఇక్కడి తప్పులను తప్పించుకోవడం కోసం ఆమె తెగ ప్రయత్నాలు చేస్తుంది అంటూ ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.

డ్రగ్స్ కేసులో ముద్దాయిలను పట్టుకొని సంచలనం సృష్టించిన ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ సతీమణే స్మితా సబర్వాల్. 2001లో ట్రైనీ కలెక్టర్‌గా విధుల్లో చేరిన స్మితా సబర్వాల్, మెదక్ జిల్లా కలెక్టర్‌గా ఎన్నో మంచి పనులు చేసి మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు.

అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా నియమితురాలై తన మార్కు పనితనం ని చూపించింది. రీసెంట్ గా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు తెలంగాణ నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమితులయ్యింది . కాళేశ్వరం పనులతో పాటు మిషన్ భగీరథ పనులను కూడా ప్రత్యేకంగా పర్యవేక్షించారు.

అయితే, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని స్మితా సబర్వాల్ కలవలేదు. నీటి పారుదల శాఖపై జరిపిన సమీక్షా సమావేశానికి కూడా హాజరు కాలేదు. కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతి, అక్రమాలలో అధికారులకూ వాటా ఉందని గతంలో కాంగ్రెస్ నేతలు ఆరోపించిన నేపథ్యంలో స్మితా సబర్వాల్ కొత్త ప్రభుత్వానికి దూరంగా ఉంటున్నారనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి.