గత రెండు రోజుల నుండి తెలంగాణ లో అసెంబ్లీ సమావేశాలు ఎంత వాడివేడి వాతావరణం మధ్య కొనసాగుతున్నాయి మనమంతా చూస్తూనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన శ్వేతపత్రం పై అసెంబ్లీ దద్దరిల్లిపోయే రేంజ్ లో చర్చలు జరిగాయి.
నిన్న రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసిన రేవంత్ సర్కార్, నేడు విద్యుత్తు శాఖా విషయం లో గతం ప్రభుత్వం చేసిన అప్పుల గురించి శ్వేతపత్రం విడుదల చేసింది.
ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ గడిచిన పదేళ్లలో విద్యుత్తు శాఖ కోసం 81 వేల కోట్ల రూపాయిలు అప్పు చేసిందని, 2014 వ సంవత్సరం ప్రారంభం లో కేవలం పది వేల కోట్ల రూపాయిల అప్పు మాత్రమే ఉండేదని.
పదిరోజుల పాలనలో రేవంత్‌రెడ్డి దూకుడు.
కానీ ఇప్పుడు అది 8 రెట్లు పెరిగింది అంటూ ఆందోళన వ్యక్తం చేసాడు. దీనిపై మాజీ విద్యుత్తు శాఖా మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించాడు.
ఆయన మాట్లాడుతూ ‘మా ప్రభుత్వ హయాం లో అన్నీ రంగాలకు 24 గంటలు విద్యుత్తు సరఫరా అందించాము..విద్యుత్తూ శాఖలో చెయ్యాల్సిన అన్నీ అభివృద్ధి కార్యక్రమాలను చేసాము’ అంటూ చెప్పుకొచ్చాడు.
అప్పుడు కోమటి రెడ్డి వెంకటి రెడ్డి మాట్లాడుతూ యాదాద్రి పవర్ ప్లాంట్ లో దాదాపుగా 20 వేల కోట్ల రూపాయిల స్కాం జరిగిందని, అందులో పది వేల కోట్ల రూపాయిలు జగదీశ్ రెడ్డి మింగేశాడని చెప్పుకొచ్చాడు.
దీనికి జగదీశ్ రెడ్డి చాలా దీటుగా సమాధానం చెప్తూ ‘నిరవధిక ఆరోపణలు పక్కన పెట్టి దమ్ముంటే దీనిపై విచారణ చేపట్టి నిజానిజాలను బయటపెట్టండి’ అంటూ సవాలు విసిరాడు.
దీనికి సమాధానంగా సీఎం రేవంత్ రెడ్డి దీనికి సమాధానం చెప్తూ ‘ ఛత్తీస్‌గఢ్‌తో చేసుకున్న ఒప్పందాలు, భద్రాద్రి పవర్ ప్లాంట్, యాద్రాద్రి పవర్‌ప్లాంట్‌పై విచారణ జరిపిస్తాం, నిజానిజాలను బయటకి తియ్యాల్సిన అవసరం చాలా ఉంది.
విద్యుత్తూ శాఖ పట్ల గత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు గుండు సున్నా’ అంటూ రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.
ఆనాటి ప్రభుత్వం ఎప్పుడూ కూడా వాస్తవాలను బయటపెట్టలేదని, ఇప్పుడు మేము గత ప్రభుత్వం లో విద్యుత్తు శాఖ చేసిన అవకతవకలను స్కానింగ్ తీసి శ్వేతపత్రం ద్వారా జనాల ముందు పెట్టామని, జగదీశ్ రెడ్డి గారి సవాలు ని స్వీకరిస్తున్నామని, త్వరలోనే విద్యుత్ శాఖపై జ్యూడీషియల్ విచారణ చేపట్టబోతున్నాం అని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చాడు.