నిజంగానే తెలంగాణ రాష్ట్ర పరిపాలనలో సరికొత్త దూకుడును ఇప్పుడు చూస్తున్నాం. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన 10 రోజుల్లోనే సీఎం రేవంత్‌రెడ్డి తనదైన దూకుడును చూపిస్తున్నారు. ఎన్నికలకు ముందు తాము ఎదైతే ప్రజలకు చెప్పామో.. దాన్ని నిలబెట్టుకునే దిశలో పనిచేస్తున్నట్లు ప్రజలకు ఒక నమ్మకం కలిగించే ప్రయత్నం ఈ 10రోజుల్లో జరిగిందని చెప్పాలి.
ఇందుకు ఉదాహరణగా ప్రగతిభవన్ చుట్టూ ఉన్న కంచెలను తొలగించడం, ప్రగతి భవన్‌లోకి ప్రజలను అనుమతిస్తూ అక్కడ ప్రజావాణి నిర్వహించడం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడం, అలాగే ఆరోగ్యశ్రీ భీమాను 10 లక్షలకు పెంచడం. 500లకు గ్యాస్ సిలిండర్ హామీ అమలు కోసం చర్యలు చేపట్టడం, మహాలక్ష్మి పథకం కింద ఇప్పటికే మహిళల నుంచి అవసరమైన పత్రాలు అధికారులు స్వీకరిస్తుండడం.
అనవసర వ్యయాన్ని తగ్గించడం కోసం తన కాన్వాయ్‌లోని 15 కార్ల నుంచి 6 కార్లను తొలగించడం. దళితుల్లో ఆత్మగౌరవాన్ని పెంచేలా దళితనేత, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా ప్రగతి భవన్‌ను కేటాయించడం.
ఎమ్మెల్యేలను తీసుకెళ్లి తేల్చడానికి అదేమైన టూరిస్ట్ స్పాటా
తాము రాజకీయ కక్షల జోలికి పోమంటూ ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా అనారోగ్యంతో ఆసుపత్రిలో జేరిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను స్వయంగా వెళ్లి పలకరించడం. ప్రజల నుంచి తాను స్వయంగా వినతులను తీసుకోవడం.. దీని ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన గ్యాప్‌ను పూడ్చడానికి చిత్తశుద్ధితో చేసిన ప్రయత్నంగా పేరు వచ్చింది.
దాని ద్వారా ప్రజలకు ప్రభుత్వాధినేత అయినా సరే అందుబాటులో ఉండాలి.. ఉంటాడు అనే నమ్మకాన్ని కలిగించారు. అలాగే ప్రజా ఉద్యమాలకు వేదిక అయిన ధర్నా చౌక్ దగ్గర ఆంక్షలు తొలగించడం. ఈ చర్య దార్వా అభివృద్ధి, సంక్షేమం కంటే ప్రజలకు స్వేచ్ఛ అనేది చాలా ముఖ్యమైనది అని.
దాన్ని వారు సంపూర్ణంగా అనుభవించగలినప్పుడే తమకు కావాల్సినవి ప్రభుత్వాన్ని విన్నవించి రాబట్టుకోగలుగుతారని ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
దాన్ని ఆచరించి చూపించారు. ఇలా అనేక విషయాలపై స్పష్టమైన వైఖరితో ముందుకు వెళుతున్నారు. కేవలం 10 రోజుల్లోనే ఇంత దూకుడు చూపించడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే.