అవకాశాలు ఇస్తామని చెప్పి హీరోయిన్లను, నటీమనులను వాడుకుంటారు అంటూ అపప్రద చిత్ర సీమ ఏళ్లుగా మోస్తూనే ఉంది. దీన్ని వ్యతిరేకిస్తూ ఎందరో పోరాడుతూనే ఉన్నారు. ‘మీటూ’ వేధికగా వాయిస్ వినిపిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ నటి చేసిన నిరసన చిత్ర సీమను మరో కుదుపు కుదిపేసింది.
టాలీవుడ్ ను షేక్ చేస్తుంది
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు గీతా ఆర్ట్స్ బ్యానర్ కు మంచి గుర్తింపు ఉంది. గీతా ఆర్ట్స్ ఎదుట ఓ నటి ఆందోళన చేపట్టడం ఇప్పుడు టాలీవుడ్ ను షేక్ చేస్తుంది. తనను వాడుకొని వదిలేశారంటూ ఆమె చేసిన ఆరోపణలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఎవరా నిర్మాత..? అంటూ ఇండస్ర్టీలో గుసగుసలు మొదలయ్యాయి.
గీతా ఆర్ట్స్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు
గీతా ఆర్ట్స్-2 ప్రొడ్యూసర్ బన్నీ వాసుకు వ్యతిరేకంగా కొంత కాలంగా బోయ సునీత ఆందోళన చేస్తుంది. అతను నన్ను మోసం చేశాడంటూ ఆరోపణలు గుప్పిస్తూనే ఉంది. గతంలో కూడా ఇలానే చాలా సార్లు నిరసనలు తెలిపింది. గీతా ఆర్ట్స్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో తన ఆందోళనను తీవ్రతరం చేసింది. ఇందులో భాగంగానే గురువారం రాత్రి నగ్నంగా గీతా ఆర్ట్స్ కార్యాలయం ఎదుట బైటాయించింది.
ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కు
తనను మానసికంగా హింసిస్తున్నారని, చంపేందుకు సైతం చూస్తున్నారంటూ ఆరోపణలు చేసింది. గతంలో ఆమె చేసిన ఆందోళనతో పోలీసులు కూడా అదుపులోకి తీసుకొని కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. మళ్లీ ఇదే తంతు కొనసాగిస్తుండడంతో ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కు తరలించారు.
బోయ సునీత మానసిక స్థితిపై అనుమానాలు
బన్నీ వాసు టార్చర్ తట్టుకోలేకనే పలు మార్లు ఎర్రగడ్డ హాస్పిటల్ కు కూడా వెళ్లానని, అనారోగ్యానికి గురయ్యానని చెప్పింది. బోయ సునీత మానసిక స్థితిపై కూడా అనుమానాలు లేకపోలేదు. గురువారం రాత్రి ఆమె ఆందోళన గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను తీసుకెళ్లారు.
గతంలో శ్రీరెడ్డి కూడా ఇలాంటి ఆందోళననే
దీనిపై బన్నీ వాసు దీనిపై క్లారిటీ ఇచ్చారు. చిత్రసీమలో మంచి గుర్తింపు ఉన్న బ్యానర్ కావడంతో తమకు ఇలాంటి తలనొప్పులు తప్పడం లేదు. గతంలో శ్రీరెడ్డి కూడా ఇలాంటి ఆందోళననే చేపట్టింది. వీరికి బ్యానర్ తో ఎలాంటి సంబంధం లేదు. గీతా ఆర్ట్స్ ను అబాసుపాలు చేసేందుకే ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నారు. సునీత మతిస్థిమితం కోల్పోయింది. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాం అంటూ చెప్పాడు.