ఒక్కోసారి మనం చేసే అతి అవతల వారికి చిరాకు తెప్పించ వచ్చు. పైగా మనకన్నా పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తుల ముందు ఎంతగా ఒదిగి ఉంటే అంత మంచింది. కాదని ఓవర్ యాక్షన్ చేస్తే వారితో చివాట్లు తినక తప్పదు. సరిగా ఇలాంటి సంఘటనే నటుడు బాబూమోహన్ విషయంలో జరిగింది. ఓ సినిమా శతదినోత్సవ వేడుక స్టేజ్ మీద తనకన్నా సీనియర్ నటుల ఉండగా.. ఆ సినిమాలో ఓ కామెడీ పాత్ర వేసిన బాబూమోహన్ ఆ పాత్ర వల్లే సినిమా వందరోజులు ఆడిoది అన్నట్లుగా మాట్లాడి అతిథిగా వచ్చిన సూపర్‌స్టార్ కృష్ణ చేత చీవాట్లు తిన్నారు.
శోభన్‌బాబు హీరోగా, శారద,`వాణిశ్రీ హీరోయిన్లుగా, హరీష్`రంభ యువ జంటగా ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఏవండీ ఆవిడొచ్చింది’. 1993లో విడుదలైన ఈ సినిమా శతదినోత్సవం జరుపుకుంది. ఈ సందర్భంగా శతదినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సినిమాలో బాబూ మోహన్‌కు పెళ్లి కాకపోవడంతో దోషం పోవడానికి గాను ఓ గాడిదను పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత బాబూమోహన్ మరో అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నా ఈ గాడిద మాత్రం అతన్ని వెంటాడుతూనే ఉంటుంది.
దీంతో ప్రేక్షకులకు కావాల్సినంత కామెడీ పండిoది. శతదినోత్సవ వేదికపై బాబూమోహన్ మాట్లాడుతూ.. నా కామెడీ వల్లే ఈ సినిమా వంద రోజులు ఆడిoది అన్నారు. దీంతో ఈ ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన సూపర్‌స్టార్ కృష్ణకు చిర్రెత్తుకొచ్చింది. శోభన్‌బాబు`వాణిశ్రీ`శారద వంటి గొప్ప నటులు నటించిన సినిమా విజయం తనదే అన్నట్లు బాబూమోహన్ అనడంతో మైక్ తీసుకున్న సూపర్‌స్టార్ ‘‘ఇది మంచి పద్ధతి కాదు. అసలు గాడిదను పెళ్లి చేసుకోవడం ఏమిటి?.
పెద్ద పెద్ద ఆర్టిస్ట్‌లు నటించిన సినిమాలో ఓ బచ్చా పాత్ర వేసిన నువ్వు నా వల్లే సినిమా ఆడిoది అని శోభన్‌బాబు, ఇతర పెద్ద నటులు ఉన్న స్టేజ్ మీద ఎలా మాట్లాడతావు. ఇంకెప్పుడూ స్థాయి మర్చి మాట్లాడకు’’ అంటూ చివాట్లు పెట్టారు. బాబూమోహన్ ఫంక్షన్‌కు వచ్చిన వారిని ఉల్లాస పరచడానికి సరదాగా ఆమాట అన్నది వాస్తవమే అయినప్పటికీ స్టేజ్ మీద పెద్దలు ఉన్నారన్న విషయం గుర్తెరిగి ఆచి తూచి మాట్లాడి ఉంటే బాగుండేది అని ఈవీవీ సైతం తర్వాత బాబూమోహన్‌తో అన్నారట.