ఆంధ్ర ప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల వాతావరణం మొదలైంది..రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం లో పాల్గొనేందుకు అన్నీ విధాలుగా సిద్ధం అవుతున్నాయి. టీడీపీ మరియు జనసేన పార్టీలు ఒక్క సరైన వ్యూహం తో ఎన్నికల రణరంగం లోకి దూకేందుకు పావులు కదుపుతుంది. అందుకోసం నియోజకవర్గాల వారీగా ఇంచార్జీలను నియమిస్తున్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర రీసెంట్ గానే మళ్ళీ మొదలైంది.
మరోపక్క పవన్ కళ్యాణ్ కూడా అతి త్వరలోనే వారాహి విజయ యాత్ర ని ప్రారంభించబోతున్నాడు. ఇలా ఎవరికి వారు తమకి తోచిన విధమైన ప్లానింగ్ తో ఉన్నారు. మరోపక్క వైసీపీ పార్టీ కూడా మరోసారి అధికారం లోకి వచ్చేందుకు అన్నీ విధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా కేంద్రం లో మరోసారి బీజేపీ పార్టీ అధికారం లోకి రాబోతుంది అనే సంకేతాలు మొదలు అయ్యాయి. మొన్న 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచి తన సత్తాని చాటింది.
లోక్ సభ ఎన్నికలలో కూడా అలాగే గెలుస్తామని బీజేపీ పార్టీ బలమైన నమ్మకం తో ఉంది. దీంతో వైసీపీ పార్టీ బీజేపీ తో సఖ్యత గానే ఉండేందుకు ప్రయత్నాలు చేస్తుంది. నిన్న వైసీపీ ముఖ్య నాయకుడు, పార్లమెంటరీ అధినేత విజయ్ సాయి రెడ్డి ప్రధాన మంత్రి మోడీతో చాలా సేపటి వరకు సుదీర్ఘ చర్చలు జరిపాడు. వీళ్లిద్దరి చర్చ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం గా మారింది. టీడీపీ మరియు జనసేన పార్టీలలో భయం కూడా మొదలైంది.
కారణం మొదటి నుండి వైసీపీ పార్టీ బీజేపీ తో కలిసి ఉన్నది అనే అపోహలు ఉన్నాయి. విజయ్ సాయి రెడ్డి ఇలా మాటికొస్తే బీజేపీ ఢిల్లీ పెద్దల చుట్టూ తిరగడం తో వీళ్ళు కలిసి ఉన్నారు అనే వాదన మరింత బలపడుతుంది. ఇంతకీ విజయ్ సాయి రెడ్డి మోడీ తో అంత సేపు ఏ విషయం మీద చర్చించాడు అనే దానిపై ఆరాలు తీస్తున్నారు.
ఈ చర్చలో పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేసేందుకు కావాల్సిన వనరులు కావాలని విజయ్ సాయి రెడ్డి కోరినట్టు చెప్తున్నారు. అంతే కాకుండా పునర్విభజన చట్టం క్రింద ఆంధ్ర ప్రదేశ్ కి దక్కాల్సిన హక్కులు దక్కే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రధాన మంత్రిని కోరాడట. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.