యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం సలార్ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే.
కానీ కేవలం తెలుగు వెర్షన్ మినహా, మిగతా భాషల్లో ఈ సినిమాకి వస్తున్న వసూళ్లు అంతంత మాత్రం గానే ఉన్నాయి. ముఖ్యంగా ఓవర్సీస్ గురించి మనం చెప్పుకోవాలి.
నార్త్ అమెరికా లో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవాలంటే పది మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టాలి. కానీ అది దాదాపుగా అసాధ్యం అని తేలిపోయింది.
ఫుల్ రన్ లో ఈ చిత్రానికి కేవలం 8 మిలియన్ డాలర్లు మాత్రమే వచ్చాయి. ఇక ముందు కూడా గ్రాస్ వసూళ్లు వచ్చే అవకాశం లేకపోవడంతో నార్త్ అమెరికా లో ఈ సినిమా ఒక లాస్ వెంచర్ గా మిగిలిపోయింది. ఇక హిందీ వెర్షన్ వసూళ్లు కూడా నార్త్ అమెరికా లో అసంతృప్తిగానే ఉన్నాయి.
ఇప్పటి వరకు ఈ సినిమాకి హిందీ వెర్షన్ వసూళ్లు కనీసం రెండు మిలియన్ డాలర్స్ కూడా రాలేదట. ఇది ప్రభాస్ రేంజ్ కి చాలా అంటే చాలా తక్కువ అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు.
ఈ సినిమా ప్రభావం ఇప్పుడు ‘పుష్ప : ది రూల్’ మీద పడింది. మేకర్స్ ఈ చిత్రానికి వంద కోట్ల రూపాయలకు ఓవర్సీస్ రైట్స్ ని అడుగుతున్నారట. కానీ బయ్యర్స్ అంత ఇచ్చేందుకు అసలు సిద్ధంగా లేరట. 50 కోట్ల రూపాయలకు మించి ఒక్క పైసా కూడా ఇచ్చేది లేదని తెగేసి చెప్పారట.
సలార్ చిత్రం అంత పెద్ద కాంబినేషన్ అయినా కూడా నష్టాలను చవి చూడాల్సి వచ్చిందని, ఇలాంటి సమయం లో పుష్ప 2 కి అంత పెట్టేందుకు సిద్ధంగా లేమని అంటున్నారట.
పైగా పుష్ప పార్ట్ 1 ఓవర్సీస్ లో బాగానే ఆడింది కానీ , పార్ట్ 2 వంద కోట్లు పెట్టేంత డిమాండ్ లో అయితే ఆడలేదు అని ఓవర్సీస్ బయ్యర్స్ అభిప్రాయం.
మరి ఆ సినిమా మేకర్స్ బయ్యర్స్ కి 50 కోట్ల రూపాయలకు ఇచ్చేస్తారా?, లేకపోతే సొంతంగా విడుదల చేసుకుంటారా అనేది చూడాలి. ప్రస్తుతానికి అయితే అడిగినంత డబ్బులు ఇవ్వడానికి బయ్యర్స్ సిద్ధం గా లేరు. ప్రమోషనల్ కంటెంట్ హిట్ అయితే ఏమైనా ఛాన్స్ ఉండొచ్చు ఏమో!.