టాలీవుడ్ లో కూడా శ్రీమంతులకు కొదువలేదు. స్టార్ డమ్ తో పాటు బాగా సంపాదించారు కూడా. బాలీవుడ్ స్టార్లతో పోటీ పడుతున్న ఈ రోజుల్లో మన స్టార్లు కూడా బాగా వెనకేసుకుంటున్నారు. సొంతంగా విల్లాలు, గెస్ట్ హౌజ్స్, ల్యాండ్యు ఇలా చాలా సంపాదిస్తున్నారు. వీటితో పాటు కొందరు సొంతంగా తిరిగేందుకు ప్రైవేట్ జట్లను కూడా కొనుక్కున్నారు. షూటింగ్ లేని సమయంలో వారు ఈ జట్లలో విహార యాత్రలకు వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రైవేట్ జట్లు కలిగి ఉన్న మన స్టార్ల గురించి తెలుసుకుందాం.
చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవికి ‘ట్రూజెట్’ అనే కంపెనీకి ఓనర్. ఆయనకు కూడా ప్రైవేట్ జట్ ఉంది. దీంతో పాటు ఆయన భారీ విమానాల కోసం ఎయిర్ క్రాఫ్ట్ ల గ్రౌండ్ హ్యాండ్లింగ్ లో కూడా సదరు ఎయిర్ లైన్స్ సంస్థ సాయం చేస్తుంది. రామ్ చరణ్ కూడా తన భార్యతో కలిసి వెకేషన్లకు వెళ్లేందుకు ఈ జట్ నే వినియోగిస్తుంటాడు.
అల్లు అర్జున్
అల్లు అర్జున్ కు విలాసవంతమైన క్యారవాన్ ఉంది. ఇది దాదాపు ఒక ఇల్లంత ఉంటుంది. దీన్ని రూ. 7 కోట్లతో కొనుక్కున్నాడు అల్లు అర్జున్. ఇంత ఖరీదైన కష్టమైస్డ్ వ్యాన్ కాబట్టి, పైగా ఇందులో కుటుంబం మొత్తం పడుతుంది కాబట్టి ఎప్పుడైనా భార్యతో విదేశాలకు వెళ్లేందుకు మాత్రం సపరేట్ జట్ వాడుతుంటాడట. అది కూడా అల్లు అర్జున్ కొనుగోలు చేసిందేనట. రేసుగుర్రం ప్రమోషన్స్ కోసం ఈ జెట్ ను ఉపయోగించారు అల్లు అర్జున్.
నాగార్జున
కింగ్ నాగార్జునకు కూడా ఒక ప్రైవేట్ జెట్ కొన్నాడు. ఆయన ఎక్కువగా ప్రైవేట్ పనులకే దీన్ని వాడుతుంటాడు. కుటుంబంతో పాటు వెకేషన్లకు వెళ్లేందుకు ఈ జెట్ వినియోగిస్తారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా సొంతంగా ఒక జెట్ ను కొన్నాడు. దీని విలువ దాదాపు రూ. 80 కోట్ల వరకూ ఉంటుంది. శంషాబాద్ విమానాశ్రమంలో దీన్ని ప్రత్యేకంగా పార్కు చేస్తారు ఆయన. అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగిస్తారు.
మహేశ్ బాబు
మహేశ్ బాబుకు కూడా సొంతంగా ప్రైవేట్ చారిటర్ జెట్ ఉంది. దీన్ని ఆయన చాలా కాలం క్రితమే కొన్నారు. భార్య, పిల్లలతో కలిసి ప్రయాణం చేసేందుకు ఈ జట్ వినియోగిస్తారు.