ప్రతీ ఏడాది లాగానే ఈ ఏడాది కూడా మన టాలీవుడ్ లో హిట్లు , సూపర్ హిట్లు మరియు ఫ్లాప్స్ ఉన్నాయి. ఈ ఏడాది ఎవ్వరూ ఊహించని విధంగా చిన్న సినిమాల హవా నడిచింది. పెద్ద సినిమాలు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. సంక్రాంతి కానుకగా విరుద్దలైన ‘వాల్తేరు వీరయ్య’ మరియు ‘వీర సింహా రెడ్డి’ వంటి పెద్ద చిత్రాలు సక్సెస్ అయ్యాయి కానీ, ఆ తర్వాత వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఆదిపురుష్’ , మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో కనిపించిన బ్రో చిత్రాలు ఒక మోస్తారుగా ఆడి వెళ్లాయి.
అయితే ఈ ఏడాది వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను సాధించిన చిత్రాలు గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. సంక్రాంతి కానుకగా వచ్చిన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం దాదాపుగా 220 కోట్ల రూపాయిల గ్రాస్ ని అలాగే 140 కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొటింది.
చరిత్ర తిరగరాసిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్
అదే సంక్రాంతికి వచ్చిన బాలయ్య బాబు ‘వీర సింహా రెడ్డి’ చిత్రం 130 కోట్ల రూపాయిల గ్రాస్ మరియు 80 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టింది. ఇక న్యాచురల్ స్టార్ నాని కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘దసరా’ చిత్రం కూడా వంద కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి చేరింది. ఇక ఆ తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం పెద్ద ఫ్లాప్ అయ్యినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా అన్నీ భాషలకు కలిపి 400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘బ్రో’ చిత్రం కూడా ఫ్లాప్ టాక్ తెచుకున్నప్పటికీ 70 కోట్ల రూపాయిల షేర్ మరియు 125 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది. ఇక రీసెంట్ గా దసరా కానుకగా విడుదలైన బాలయ్య బాబు ‘భగవంత్ కేసరి’ చిత్రం కూడా వంద కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి చేరింది.
ఈ ఏడాది మన టాలీవుడ్ నుండి వంద కోట్ల రూపాయిల గ్రాస్ క్లబ్ లోకి చేరిన సినిమాలు ఇవే. మధ్యలో డబ్బింగ్ సినిమా రజినీకాంత్ జైలర్ చిత్రం కేవలం తెలుగు వెర్షన్ నుండి 80 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టగా, రీసెంట్ గా విడుదలైన హిందీ దబ్ చిత్రం ‘ఎనిమల్’ తెలుగు వెర్షన్ వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.