మెగాస్టార్ చిరంజీవి నటించిన గత రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు అనే విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమాల ఫలితాలు చూసి ఇక చిరంజీవి పని అయిపోయింది. ఆయనని ఎవ్వరు చూడరు..సీనియర్ హీరోలైన బాలకృష్ణ ,వెంకటేష్ మరియు నాగార్జున వంటి హీరోలలో ఒకడిగా అయిపోయాడు. నేటి తరం స్టార్ హీరోలకు ఇక ఆయన పోటీ కాదు అనే మాటలు బలంగా వినిపించాయి. కానీ ఒకటి రెండు ఫ్లాపులతో తరిగిపోయే క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ కాదు ఆయన సంపాదించింది.
ఫ్యాన్స్ కి పూనకాలు
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చిరస్థాయిగా, తిరుగులేని మెగాస్టార్ గా ముద్ర వేసుకున్నాడని చెప్పడానికి బెస్ట్ ఉదాహరణ గా నిలిచింది. ఆయన లేటెస్ట్ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్. డైరెక్టర్ బాబీ మెగాస్టార్ ని ఊర మాస్ రోల్ లో చూపిస్తూ ఈ సినిమాని ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చే రేంజ్ ఔట్పుట్ వచ్చేలా చేసాడని ఇండస్ట్రీ లో కొన్ని విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.
‘బాస్ పార్టీ’ పాట భారీ హిట్ అవ్వడం
ఇక ఈ సినిమా థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ అన్నీ ప్రాంతాలలో హాట్ కేక్ లాగ అమ్ముడుపోతుంది. ప్రొడ్యూసర్ ఎంత అడిగినా కూడా కాదనకుండా ఈ చిత్రం రైట్స్ ని కొనుగోలు చేస్తున్నారు బయ్యర్స్. అందులోనూ ఈ సినిమా నుండి ఇప్పటి వరుకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కూడా అదిరిపోవడం ‘బాస్ పార్టీ’ పాట భారీ హిట్ అవ్వడం. మూవీ పై మాస్ మరియు యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడేలా చేసింది.
రీసెంట్ ఉదాహరణ ఇదే
రెండు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినా కూడా 70 ఏళ్ళ వయసుకి దగ్గర పడుతున్న ఒక హీరో వంద కోట్ల రూపాయలకు పైగా థియేట్రికల్ బిజినెస్ చేస్తున్నాడు అంటే మాములు విషయమా. అందుకే మెగాస్టార్ తో ఎవరిని పోల్చొద్దు అని ట్రేడ్ పండితులు సైతం చెప్తూ ఉంటారు. దానికి రీసెంట్ ఉదాహరణ ఇదే. ఒకవేళ సినిమాకి హిట్ టాక్ పడితే వారం రోజుల లోపే వంద కోట్ల షేర్ మార్కుని అవలీల గా దాటేస్తాడు అనడం లో ఎలాంటి సందేహం లేదని ట్రేడ్ పండితులు సైతం అభిప్రాయ పడుతున్నారు.