అల్లుడుకి మొదట ఒక కూతురిని ఇచ్చి పెళ్లి చేసాడు మామ. అయితే ప్రసవ సమయంలో బిడ్డకు జన్మ ఇచ్చి ఆ తల్లి మరణించింది. బిడ్డ బతకడంతో అల్లుడు, బిడ్డ బాబొగులు చూసుకోవడం కోసం అల్లుడికి మరో కూతురిని ఇచ్చి చేసాడు ఆ మామ. అయితే ఆ కాపురం కూడా కుప్పకూలి పోయింది. ఆ వివరాలలోకి వెళితే.. శ్రీకాకుళం జిల్లా విజయనగరం లో 2011లో ఎనిమిదేళ్ల క్రితం సాంబి నాయుడు, ఉషారాణి కి పెళ్లి జరిగింది. అయితే వ్యాపారం నిమిత్తం వారు రామభద్రపురం శ్రీరాంనగర్ కాలనీలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని నివాసం ఉంటున్నారు.
అంతకంటే ముందు మరో పెళ్లి
అయితే ఇద్దరి మధ్య మనస్పర్థలు కారణంగా భార్య ఉరి వేసుకొని చనిపోయింది. అయితే భార్య చనిపోయిన విషయాన్ని పోలీసులకు చెప్పకుండా జరిగిన సంఘటనని అత్తామామలకు చెప్పాడు. దీనితో వారు కన్నీరు మున్నేరు అయ్యారు. భర్త వేధింపులు తట్టుకోలేక తన కూతురు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఉషారాణి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అతడిని విచారించి అధరాలు సేకరించారు. అయితే 2011 కంటే ముందు సాంబి నాయుడు కి తన మొదటి కూతురిని ఇచ్చి పెళ్లి చేసాడు ఉషారాణి తండ్రి.
ప్రసవ సమయంలో బిడ్డకు జన్మ ఇచ్చి
అయితే ప్రసవ సమయంలో బిడ్డకు జన్మ ఇచ్చి ఆ తల్లి మరణించింది. బిడ్డ బతకడంతో అల్లుడు, బిడ్డ బాబొగులు చూసుకోవడం కోసం అల్లుడికి మరో కూతురు ఉషారాణిని ఇచ్చి పెళ్లి చేసాడు మామ. ఇప్పుడు రెండో భార్య కూడా ఆత్మహత్య చేసుకుంది. కాగా సాంబినాయుడికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుసుకున్నారు. అదనపు కట్నం తీసుకురావాలని మద్యం తాగి భార్యను కొట్టేవాడు. ఆ వేధింపులు తట్టుకోలేక తమ చిన్న కుమార్త ఆత్మహత్య చేసుకుందని ఉషారాణి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీనిపై పోలీసులు మరింత సమాచారాన్ని రాబడుతున్నారు.