పెట్రోల్ మరియు డీజల్ రేట్లు ఆకాశాన్ని అంటిన ఈ నేపథ్యం లో సాధారణ మధ్య తరగతి కుటుంబాలకు ఎంతో భారంగా మారిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇది ప్రభుత్వ నిర్ణయం కాబట్టి మనం కూడా చేసేది ఏమి లేదు, రేట్లకు తగ్గట్టుగా వాడుకోవడమే మనం చెయ్యాల్సిన పని. అయితే పెట్రోల్, డీజల్ ని ఉపయోగించే వాహనదారులకు మేలు జరిగేలా గూగుల్ మ్యాప్స్ లో ‘సేవ్ ఫ్యూయల్’ అనే ఫీచర్ రాబోతుంది.
ఈ ఫీచర్ ద్వారా ఎంత ఇంధనం ని సాధ్యమైనంత వరకు ఆదా చెయ్యొచ్చు. ఇప్పటికే ఈ ఫీచర్ అమెరికా, కెనడా మరియు యూరోప్ దేశాలు వాడుతున్నాయి. ఈ ఫీచర్ ద్వారా సత్ఫలితాలు కూడా వచ్చాయి. కానీ ఇప్పటి వరకు మన భారత దేశం లో ఈ ఫీచర్ రాలేదు. అతి త్వరలోనే ఈ ఫీచర్ మన ఇండియా లో కూడా ప్రవేశబెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఈ ఫీచర్ గురించి పూర్తిగా ఒకసారి తెలుసుకుందాము.
మెట్రో రైల్ విస్తరణకు రేవంత్ రెడ్డి బ్రేక్!…
గూగుల్ కంపెనీ గత ఏడాది సెప్టెంబర్ నెలలో ఈ ఫీచర్ ని ప్రవేశపెట్టింది. ముందుగా మూడు దేశాల్లో ప్రవేశపెట్టి, దానికి వచ్చిన రెస్పాన్స్ ఆధారంగా మిగిలిన దేశాల్లో కూడా ప్రారంభించాలని అనుకుంది. ఊహించిన దానికంటే పాజిటివ్ ఫలితాలు రావడం తో ఈ ఫీచర్ ని భారతదేశం లో కూడా ప్రవేశ పెట్టాలని నిర్ణయించుకుంది.
ఈ ఫీచర్ లో ఉన్న విశేషం ఏమిటంటే, మనం వాడే కార్/బైక్ ఇంజిన్ పరిస్థితిని బట్టి, ఎంత ఫ్యూయల్ వాడాలి అనేది చెప్పేస్తుంది. ఆ తర్వాత వెళ్తున్న దారిలో షార్ట్ కట్స్ చెప్పి ఫ్యూయల్ వినియోగం తగ్గించేలా చేస్తుంది. అంతే కాకుండా వెళ్లే దారిలో రోడ్లు ఎలా ఉన్నాయి?, ఒకవేళ మీరు వెళ్లే దారిని అకస్మాత్తుగా మార్చితే,గూగుల్ మ్యాప్స్ తక్కువ ఇంధన వినియోగంతో ప్రత్యామ్నాయ మార్గాలను సైతం చూపుతుంది. ఇది ఎలా వాడాలో ఒకసారి తెలుసుకుందాం.
* ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మ్యాప్స్ యాప్ ని ఓపెన్ చేయండి.
* ఆ తర్వాత సెట్టింగ్స్ ఆప్షన్‌లోకి వెళ్లి, క్రిందకి స్క్రోల్ చేసి నావిగేషన్ సెట్టింగ్సుపై క్లిక్ చేయండి.
* అలా క్లిక్ చేసిన తర్వాత మీకు కొన్నిఆప్షన్‌లు చూపిస్తాయి..వాటిలో రూట్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
* అందులో ‘ఇంధన సమర్థ మార్గాలు’ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
* అక్కడే మీ వెహికల్ ఇంజిన్ రకంపై నొక్కండి.
* తర్వాతరు మీరు వెళ్లాల్సిన గమ్యాన్ని ఎంటర్ చేయండి.
* ఒకవేళ మీ వెహికల్ ఇంజిన్ వివరాలు లేకపోతే కిందికి స్క్రోల్ చేయండి.
* అక్కడ మీ వాహనం ఇంజిన్ రకం వివరాలు ఇవ్వండి.