సమాజంలో ఏ అన్యాయం చోటు చేసుకున్నా.. ఏ అక్రమం వెలుగు చూసినా ముందుగా మనం ఆశ్రయించేది పోలీసులనే. దురదృష్ట వశాత్తూ ఆ శాఖలో కొందరు ఖాకీల లంచగొండితనం, పక్షపాతం వల్ల ప్రజలతో సెల్యూట్ కొట్టించుకోవాల్సిన పోలీసులు తిట్లతో త లదించుకుంటున్నారు. అయితే అందరూ అలా ఉండరు. ఈ డిపార్ట్మెంట్లో కూడా కొందరు నిజాయితీపరులు ఉంటారు. మనం సినిమాల్లో చూసే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్లలాగా. ఈ కోవకు చెందిన ఓ పోలీసు ఓ సంచలన కేసులో ముద్దాయి అయిన కన్న కొడుకును అనుమానం రాకుండా ఢల్లీి నుంచి రప్పించి, అరెస్ట్ చేయించాడు.
ఇటీవల ఆన్లైన్ మనీ యాప్స్ ద్వారా ప్రజలకు విపరీతమైన వడ్డీలకు డబ్బును అకౌంట్లలో వేయడం, ఆ తర్వాత తిరిగి వారిని మానసికంగా వేధించడం, వారి చావుకు కారణమౌతున్న ఉదంతాలు వెలుగు చూడడం సంచలనం కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మోసాలకు మూలకారకుడు చైనాకు చెందిన లాంబో. ఇతనికి సహకరించిన కీలక వ్యక్తుల్లో కర్నూలు జిల్లాకు చెందిన నాగరాజు ఒకరు. ఢల్లీి నుంచి నాగరాజు ఈ మోసంలో కీలక పాత్ర వహించాడు. ఇటీవల కొడుకు విలాస వంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు తెలుసుకున్న నాగరాజు తండ్రి కొడుకుపై నిఘా పెట్టాడు.
కర్నూలు జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా పనిచేస్తున్నారు ఆయన. ఆన్లైన్ యాప్స్ కేసు దర్యాప్తులో భాగంగా తన కొడుకు సైతం ఈ విషవలయంలో భాగస్వామి అని తెలుసుకున్నారు. తన నిజాయితీ ముందు కన్న కొడుకుపై ప్రేమ ఎక్కువ కాదని నిరూపించడానికి సిద్ధమయ్యారు. అన్నీ తెలిసినా.. ఏమీ ఎరుగనట్లు నాగరాజుకు అనుమానం రాకుండా అతన్ని ఢల్లీి నుంచి ఇంటికి రప్పించాడు. అనంతరం క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు సీక్రెట్‌గా సమాచారం అందించారాయన. పోలీసులు వచ్చే వరకూ అతనికి అనుమానం రాకుండా జాగ్రత్తగా కాపలా కాశారట తండ్రి. తన వివరాలు బయటకు చెప్పవద్దని ఆ ఏఎస్సై పోలీసులను కోరడంతో ప్రస్తుతానికి అతని వివరాలు బహిర్గతం చేయలేదు. ఇలాంటి తండ్రులు ఉన్నంత కాలo పోలీస్‌లు గౌరవం తలెత్తుకుంటూనే ఉంటుంది.