వామ్మో 30 మంది జంప్‌ జిలానీలా

0
468
kcr

రాజకీయం అంటేనే మైండ్‌ గేమ్‌. ఎన్నికలకు ముందు ఒకరినొకరు తిట్టి పోసుకోవడం, అనక అమాంతం కౌగిలించుకోవడం ఇక్కడ కామన్‌. ఏపార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి జై కొట్టడం నమ్మి సీటిచ్చిన పార్టీని, నమ్మకంతో ఓట్లేసిన ప్రజలను నట్టేట ముంచడం నయా రాజకీయాల్లో వెన్నతో పెట్టిన విద్య. యన్టీఆర్‌ ఎపిసోడ్‌ తర్వాత మైండ్‌గేమ్‌ పాలిటిక్స్‌కు గిరాకీ బాగా పెరిగింది. యన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేయడంలో ఈనాడుతో కలిసి చంద్రబాబు ఆడిన మైండ్‌ గేమ్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. హంగ్‌ రాజకీయాల్లో ఈ మైండ్‌గేమ్‌కు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు.

ఈ మధ్య ఎన్నికల వేడి, హడావుడి లేకపోయినా అవతల పార్టీలను కలవరానికి గురి చేయడానికి ఈ మైండ్‌గేమ్‌ పాలిటిక్స్‌కు పదును పెడుతున్నాయి రాజకీయ పార్టీలు. తాజాగా తమ పార్టీలోకి దూకడానికి 30 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రకటించారు. వారు తమతో టచ్‌లోనే ఉన్నారని, అవసరాన్ని బట్టి బయటకు వస్తారంటూ సంచలన ప్రకటన చేశారు.

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో ఊహించని స్థాయిలో సీట్లు సాధించిన బీజేపీ మరింత దూకుడు ప్రదర్శిస్తూ పోతోంది. అయితే బండి సంజయ్‌ చేసిన ఈ ప్రకటన కేవలం అత్యుత్సాహంతోను, మైండ్‌గేమ్‌ రాజకీయంగానే భావించాలి. ఇప్పటికైతే అంత భారీ స్థాయిలో ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌ను వీడటం జరిగేపని కాదు.
ఇదే ప్రకటన ఏ అసెంబ్లీ ఎన్నికలముందో చేసి ఉంటే ప్రజల్లో కొంతైనా ఆలోచన రేకెత్తేదేమో. కానీ ఇంకా అసెంబ్లీ ఎన్నికకు 3 సంవత్సరా టైం ఉండగా ఇలా పార్టీకి అనవసర హైప్‌ను తీసురావటానికి ప్రయత్నించి అభాసుపాలు కావడం తప్ప ఉపయోగం ఉండదని బీజేపీ వర్గాలే వ్యాఖ్యానిస్తుండడం కొస మెరుపు.

మరోవైపు దుబ్బాక, గ్రేటర్‌ ఎన్నిక ఫలితాతో కేసీఆర్‌ డ్యామేజ్‌ కంట్రోల్‌కు దిగారు. మన అధికారం శాశ్వతం అన్న భావన నుండి క్షేత్రస్థాయి పరిణామాలను అంచనా వేస్తూ అటు కేంద్రంతోను, ఇటు ఉద్యోగ సంఘాతోనూ సఖ్యతను కుదుర్చుకునే పనిలో ఉన్నారు కేసీఆర్‌. ఇలాంటి తరుణంలో ఎమ్మెల్యేు కూడా కారు దిగడానికి సాహసించక పోవచ్చు. ఇప్పటికిప్పుడు 30 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లినా ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు లేవు. ఈ విషయం గ్రహించే టీఆర్‌ఎస్‌లో ఉన్న కొందరు అసంతృప్త ఎమ్మెల్యేలు అనవసరంగా బైట పడడం ఎందుకని మౌనం వహిస్తున్నారు.