వైఎస్ షర్మిల షర్మిల తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో కలపడంతో అటు తెలంగాణతో పాటు.. ఇటు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి.
ఎన్నికలకు ముందు ఇలా కాంగ్రెస్ లో కలవడం.. మరో పక్క తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రాజకీయం ఆసక్తిగా మారింది.
మరో పక్క క్రిస్మస్ కి షర్మిల లోకేష్ కి విషెస్ చెప్పడంతో.. చెప్పి ప్రత్యర్థి ఉచ్చులో లో బిగుసుకుంటుందా? అనే అనుమానాలు జగన్ కి రాక తప్పదు.
ఇక ఇప్పటికే టిడిపి కి సంబందించిన మ్యుహకర్తలు బిజెపితో కన్నా.. కాంగ్రెస్ తో జట్టు కడితే రాజకీయ ఉపయోగం ఉంటుందని చంద్రబాబుకి విన్నవించారట.
దీనితో రానున్న ఎన్నికల్లో టిడిపి, జనసేన, కాంగ్రెస్ పార్టీలు కలసి వైసిపిని ఎదుర్కోవడానికి సిద్దపడుతున్నాయని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు.
ఇదే జరిగితే ఆంధ్రప్రదేశ్ లో జరుగబోయే ఎన్నికలు మరో కురుక్షేత్ర యుద్దాన్ని తలపించడం ఖాయంగా కనిపిస్తుంది.
అయితే వైఎస్ఆర్ బతికి ఉన్న రోజుల్లో చంద్రబాబుపై ఎలా పోరాటం చేశారో చెప్పాల్సిన పని లేదు. మరి ఇప్పుడు ఆయన కూతురు చంద్రబాబుతో జట్టు కడుతుందని కుచించుకుంటేనే వైఎస్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
అసలు షర్మిల ఎందుకు ఇంతలా తెగిస్తుంది. నిజంగా అన్నతో విభేదాలే కారణమా? అనే అనుమానాలు వస్తున్నాయి. మహా అయితే ఆస్తి గొడవలో, లేక పదవి ఇవ్వలేదనే కోపం ఉండవచ్చు.
అంత మాత్రాన ప్రత్యర్థితో జత కట్టి.. కుటుంబ పరువు రోడ్డుపై పెట్టాల్సిన పని ఏముంది అని అభిమానాలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్ఆర్ కుటుంబం ఆస్తుల విషయాలు ఎలా ఉన్నా.. షర్మిలకి మాత్రం బాగానే ఆస్తులు ఉన్నాయని చెప్పవచ్చు. ఆమె ఎక్కడికి వెళ్లినా మంది మార్బలంతో ఫ్లైట్ లలోనే తిరుగుతుంది.
మరి అన్ని ఆస్తులు ఉన్నా.. షర్మిల ఇలా చేయడం చూస్తుంటే ఆమెకి సరైన అవగాహన కల్పించే వాళ్ళు లేరని నిపుణులు భావిస్తున్నారు.