దిగ్గజ నటుడు, నటధీరుడు దివంగత నందమూరి తారకరామారావు గురించి పరిచయమే అవసరం లేదు. ఆయన నటనను అభిమానించని వారు ఉండరంటే అతిశయోక్తి లేదు. అన్ని తరాల ప్రేక్షకులను ఆయన చిత్రాలు ఇప్పటికీ అలరిస్తూనే ఉన్నాయి. ఆయన శారీరకంగా మన మధ్య లేకున్నా, చిత్రాలతో మాత్రం ఎన్నటికీ మనసుల్లో నిలిచిపోతారు.
జానపద, చారిత్రక, పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో నటించి విమర్శకులను కూడా నోళ్లు మూయించారు ఆయన. తమిళ నటుడు ఎంజీఆర్ ను ఆదర్శంగా తీసుకొని తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగు ప్రజల కోసం ఎనలేని సేవలు చేసిన మహోన్నత వ్యక్తి సీనియర్ ఎన్టీఆర్.
ఇంటర్వ్యూలో కైకాల విషయాలు
గతంలో ఒక ఇంటర్వ్యూలో కైకాల సత్యనారాయణ ఎన్టీఆర్ గురించి కొన్ని విషయాలు చెప్పారు. కైకాల రెండు రోజుల క్రితం మరణించడంతో ఈ ఇంటర్వ్యూ ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనతో ఎన్టీఆర్ కు ఉన్న సాన్నిహిత్యాన్ని కైకాల చాలా స్పష్టంగా వివరించారు. దీనితో పాటు ఎన్టీఆర్ పార్టీ ఎందుకు స్థాపించారు. ఎవరు కారణం అనే విషయాన్ని కూడా చెప్పారు. ఎన్టీఆర్ ను రాజకీయంగా కొందరు అవమానించారని వాటి వల్లే ఆయన పట్టుదలతో తెలుగు దేశం పార్టీ పెట్టి మరీ సీఎంగా గెలిచి తెలుగు రాష్ర్టాన్ని పాలించారని చెప్పారు. ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..
ఎన్టీఆర్ తో సరదాగా గడుపుతాన్న కైకాల
కైకాల సత్యనారాయణ, సీనియర్ నందమూరి తారక రామారావు ఇద్దరూ దాదాపు సమకాళీకులు. ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. నువ్వా, నేనా అన్నట్లు పోటీ పడి మరీ నటించేవారు. ఒకరి నటనను ఒకరు మెచ్చుకునే వారు కూడా. గతంలో ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో కైకాల సత్యనారాయణ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ ‘ఎన్టీఆర్ నాకు అత్యంత సన్నిహితుడు. ఆయనతో చాలా ఫ్రీగా ఉండేవాడిని. ఆ కాలంలో ఆయన స్టార్ డమ్ ను చూసిన చాలా మంది నటులు ఆయనకు గౌరవం ఇచ్చేవారు, భయపడుతుండే వారు కూడా.. కానీ నేను మాత్రం చాలా చనువుగా ఉండేవాడిని.
ఇలా ఆయన చనిపోయేంత వరకూ కూడా ఉన్నాం. సీఎం అయ్యాక చాలా సార్లు మా ఇంటికి వచ్చారు కూడా. ఆయన నాతో ఒక సందర్భంలో ఒక విషయం చెప్పారు. మంచి నటుడిగా, సీఎంగా ఉన్నత స్థానంలో నిలబెట్టిన ఈ ప్రజల కోసం ఏదైనా చేయాలని అనుకున్నా.. అందుకే తెలుగుదేశం పార్టీ పెట్టాను అని చెప్పారు.
ఎన్టీఆర్ కు అవమానాలు
ఎన్టీఆర్ జాతకం ప్రకారం కూడా 60 సంవత్సరాల తర్వాత నటనను విడిచి పెట్టి మరో విభాగంలోకి వెళ్లాలని ఉందట. అందుకే ఆయన పాలిటిక్స్ ను ఎంచుకున్నారు. అప్పట్లో ఒకసారి సరోజినీ పుల్లారెడ్డి ఒక పదవిలో ఉన్నారు. ఆ సమయంలో ఎన్టీఆర్ స్టార్ హీరో సరోజినీని కలిసేందుకు ఆయన వెళ్లారు. ఆమె రెండు గంటలపాటు వెయిట్ చేయించారు. అయినప్పటికీ కలవకుండా వెళ్లిపోయారు. వెంకటరామిరెడ్డి కూడా ఒక సందర్భంలో ఎన్టీఆర్ ను తన ఆఫీస్ లోకి రానివ్వలేదు. ఆ అవమానాల వల్లే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారు’. అంటూ కైకాల ఆ ఇంటర్వ్యూలో వివరించారు.