రాజకీయాల్లో ఒక్కోసారి అవకాశాలు ఎటు నుంచి మన తలుపుతడతాయో ఊహించడం కష్టం. మనం మాత్రం మన పని చేసుకుంటూ పోవడమే. అవకాశాలు వాటంతట అవే కలిసొస్తుంటాయి అంతే. ఆ వచ్చిన అవకాశాలు సామాన్యమైన కావొచ్చు… ఒక్కోసారి మన కెరీర్‌లోనే రికార్డ్‌లు సృష్టించే అవకాశాలు కూడా కావొచ్చు.
తాజాగా ఇలాంటి అరుదైన అవకాశాలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రిని వరించాయి. విశేషమేమిటంటే వీరిద్దరూ ఇప్పటి వరకూ మంత్రి పదవులు నిర్వహించిన అనుభవం లేదు. కానీ కష్టపడేతత్వం, అదృష్టం, సుదీర్ఘ రాజకీయ అనుభవం వీరిని ఒక్కసారిగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవుల్లో కూర్చోబెట్టాయి.
కేసీఆర్ అలా ఫిక్స్ అయిపోయారా
అయితే ఇలా వచ్చిన అరుదైన అవకాశాన్ని ఉపయోగించుకుని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తనదైనశైలిలో పాలన సాగిస్తున్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను వీలైనంత వేగంగా అమలు పరచడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నారు. 100 రోజుల్లోనే పార్టీ వాగ్ధానాలను అమలు పరచే దిశగా యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారు.
మరోవైపు డిప్యూటీ సీఎంగా తనకు లభించిన అరుదైన అవకాశాన్ని మల్లు భట్టివిక్రమార్క సైతం సద్వినియోగం చేసుకుంటూ తనకు లభించిన కీలక శాఖకు సంబంధించిన రివ్యూ మీటింగ్‌లు నిర్వహించడం, తమ పార్టీ వాగ్ధానాల అమలు కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిధుల సమీకరణ, ఆర్ధిక దుబారాను అరికట్టే దిశగా ముందుకు వెళుతున్నారు.
మొత్తానికి మంత్రులు కాకుండానే ఉన్నత పదవులకు ఎదిగిన వీరిరువురూ అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. రాష్ట్రం వేరైనప్పటికీ మరో కంపారిజన్ చూస్తే… అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా వై.యస్. జగన్‌మోహన్‌రెడ్డి మంత్రిగా పని చేయకుండానే ఏకంగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. రేవంత్‌రెడ్డి, జగన్‌మోహన్‌రెడ్డిల్లో ఉన్న మరో ఇంట్రస్టింగ్ కోణం.. ఇద్దరూ ఎంపీలుగా పనిచేసి, ఆ ఆనుభవంతో ముఖ్యమంత్రులు అయిన వారే.