చిత్తూర్ జిల్లా దిగువ వాండ్ల పల్లె లో భర్త ఇంటి ఎదుట భార్య నిరసనకు దిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త మూడు రోజుల నుండి కనిపించడం లేదని.. అత్తింటి వారే అతడిని దాచిపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తుంది ఆ యువతి. తెలంగాణ నల్గొండ జిల్లాకి చెందిన మహమ్మద్ సనా మదనపల్లి మండలం దిగువ వాండ్ల పల్లె లోని భర్త ఇంటి ఎదుట బైఠాయించి ఆందోళన చేసింది.
మదనపల్లి ఎస్టేట్ లో అద్దె ఇల్లు
2019 లో తాను ఈ సెట్ శిక్షణలో ఉండగా రమేష్ కుమార్ తో పరిచయం ఏర్పడిందని మహమ్మద్ సనా తెలిపింది. ఈ ఏడాది జనవరి నాలుగున మదనపల్లి మండలం లోని ఓ ఆలయంలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నామని చెప్పింది. మరుసటి రోజు నుండి అత్తింటి వారు తనకు ఆహారం కూడా పెట్టకుండా ఇబ్బంది పెట్టారని చెప్పింది. దీనితో ఇటీవల మదనపల్లి ఎస్టేట్ లో ఓ అద్దె ఇంటికి వెళ్లామని తెలిపింది.
మూడు రోజుల క్రితం బయటికి వెళ్ళాడు
అయితే మూడు రోజుల క్రితం తన భర్త రమేష్ కుమార్ ఇంటి నుండి బయటికి వెళ్లి తిరిగి రాలేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్తింటి వారిని అడిగితే తనకు తెలియదని చెప్పారని.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలంగాణకి చెందిన సనా వివరించింది. మాతాంతర వివాహం చేసుకోవడంతో అత్తింటి వారు తనని గృహ హింస పెట్టారని సనా కన్నీటి పర్యవంతం అయింది.
రాజకీయ నాయకులు జోక్యం
తన భర్త రమేష్ కుమార్ ని వదిలిపెట్టాలని తన అత్తింటి వారితో పాటు, కొందరు రాజకీయ నాయకులు తనను కొట్టారని తెలిపింది. అయితే తాను వదిలి పెట్టనని తేల్చి చెప్పడంతో ఇలా చేశారని పోలీసులకు తెలిపింది. తన భర్త ఆచూకీ తెలిపి న్యాయం చేయాలని కోరుతుంది.