హైదరాబాద్… నాడు ఉమ్మడి రాష్ట్రంలో కావొచ్చు.. నేడు తెలంగాణ రాష్ట్రంలో రాజధాని నగరం మాత్రమే కాదు.. భిన్న సంస్కృతుల సంగమం. దేశంలోనే అతి ముఖ్యమైన మెట్రోపాలిటన్ నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌కు ప్రపంచ దేశాల్లో తనదైన గుర్తింపు తెచ్చుకుంది.
ఒకప్పుడు సాధారణ జనజీవనంతో అలరాడిన హైదరాబాద్ రాను రాను కాంక్రీట్ జంగిల్‌గా మారిపోయింది. ముఖ్యమంగా సాఫ్ట్‌వేర్ రంగం దినదినాభివృద్ధి చెందటం..
దాని ప్రభావంతో రియల్ ఎస్టేట్ భూమ్‌కూడా తోడవడంతో అతి తక్కువ కాలంలోనే హైదరాబాద్ నగర విస్తరణ ఊహించని రీతిలో వేగం పుంజుకుంది.
ధరణిలో మాజీ ఎమ్మెల్యే 2 ఎకరాలు మాయం
20 సంవత్సరాల క్రితం విజయవాడ జాతీయ రహదారిలో దిల్‌సుఖ్‌నగర్ నగర శివారు.. ఆ తర్వాత అది కాస్తా కొత్త పేటకు, ఆ తర్వాత ఎల్.బి. నగర్‌కు అక్కడి నుంచి వనస్థలిపురంకు అటు నుంచి హయత్ నగర్‌కు శరవేగంగా శివారు ప్రాంతం మారిపోయింది. మిగిలిన మూడు వైపులా ఇంత వేగంతో నగరం విస్తరించింది.
దీంతో నగర విస్తరణతో పాటు నగరంలోని ట్రాఫిక్ కూడా అనూహ్యంగా పెరిగిపోయింది. ముఖ్యంగా 2000వ సంవత్సరం నుంచి మొదలైన ట్రాఫిక్ రాను రాను పెరిగి నేడు అడుగుతీసి అడుగు వేయలేని పరిస్థితికి చేరింది.
ఈ కారణంగానే నగరంలో ఎన్ని ట్రాఫిక్ రూల్స్ అమలు చేసినా అనూహ్యంగా వాటన్నింటినీ దాటుకుని ట్రాఫిక్ కష్టాలు దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా ప్రధాన రహదారుల్లో అయితే చెప్పక్కర్లేదు. కేవలం 10 కి.మీ. ప్రయాణానికి 1 గంట నుంచి 1.30 ని॥లు పడుతోంది.
దీనికి చెక్ చెప్పటానికి ఢల్లీి తరహా సరి, బేసి విధానాన్ని తీసుకు రావటానికి అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. ఈ విధానంలో మీ వాహనం నంబరు చివరన సరి సంఖ్య ఉంటే (2,4,6,8,10,12 ఇలా)సరి సంఖ్యలు వచ్చే తేదీల్లో మాత్రమే వాహనంపై రోడ్ల మీదకు రావాలి.
అదే బేసి సంఖ్య (1,3,5,7,9 ఇలా)బేసి సంఖ్య వచ్చే తేదీల్లో మాత్రమే మీరు వాహనంతో రోడ్లపైకి రావాలన్నమాట.
అయితే ఓలా, ఉబర్ ఇతర క్యాబ్ సంస్థల వాహనాలకు ఈ రూల్స్ వర్తించవు. అలాగే ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా మినహాయింపు ఉంటుంది.
ప్రస్తుతం ఈ విధానం ఢల్లీిలోను, ముంబాయిలోను అమల్లో ఉంది. అయితే దాదాపు 90 లక్షల వాహనాలు ప్రతినిత్యం తిరిగే హైదరాబాద్ వంటి భిన్నమైన ప్రాంతంలో ఈ విధానం సాధ్యమేనా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు కొందరు.
అందుకే ముందుగా కొన్ని రోజులు ట్రయల్‌రన్ లాగా ఈ విధానం ప్రవేశ పెడితే దానిలోని లోటుపాట్లు తెలుస్తాయని, తర్వాత పకడ్భందీగా ఈ విధానాన్ని అమలు చేయవచ్చు అని అధికారాలు ఆలోచిస్తున్నారట.