యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘సలార్’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న సునామి ని మనమంతా చూస్తూనే ఉన్నాం. కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా దాదాపుగా 350 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
ప్రభాస్ కి ఇది చాలా మాములు విషయం అయిపోయింది. బాహుబలి సిరీస్ తర్వాత ఆయనకి ఒక్క సూపర్ హిట్ టాక్ వచ్చిన సినిమా రాలేదు ఒక్క సలార్ తప్ప. అయినప్పటికీ కూడా ఆ ఫ్లాప్ సినిమాలతోనే మన టాలీవుడ్ స్టార్ హీరోల సూపర్ హిట్ కలెక్షన్స్ ని దాటేశాడు.
ఇక సలార్ కి సూపర్ హిట్ టాక్ వస్తే ఎందుకు ఊరుకుంటాడు. కచ్చితంగా వెయ్యి కోట్ల రూపాయిలు కొల్లగొట్టే దిశగానే అడుగులు వేస్తాడు, వేస్తున్నాడు కూడా. నాల్గవ రోజు క్రిస్మస్ అవ్వడం ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయ్యింది. అలాగే ఈ వీకెండ్ మరియు న్యూ ఇయర్ ఈ సినిమా వసూళ్లను అమాంతం పెంచేస్తుంది.
న్యూ ఇయర్ రోజుకి ఈ చిత్రం 700 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుకి చేరుకుంటుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. కానీ హిందీ మరియు ఇతర భాషలకు సంబంధించిన వసూళ్లు అంతంత మాత్రం గానే ఉన్నాయి.
ఇక రేపటి నుండి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో కూడా వసూళ్లు బాగా డ్రాప్ అయ్యేలా కనిపిస్తున్నాయి. వసూళ్లు మళ్ళీ పికప్ అవ్వాలంటే కచ్చితంగా టికెట్ రేట్స్ తగ్గించాలి.
తెలంగాణ లో వీకెండ్ తర్వాత కూడా 450 రూపాయిల చొప్పున మల్టీప్లెక్స్ థియేటర్స్ లో విక్రయిస్తున్నారు బయ్యర్లు . అంత డబ్బులు పెట్టి ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాని ఎలా చూస్తారు చెప్పండి?..
బయ్యర్స్ అత్యుత్సాహం తో ఇలా సినిమాల థియేట్రికల్ రన్స్ ని కిల్ చేస్తున్నారు. కేవలం సలార్ విషయం లోనే కాదు, #RRR మూవీ విషయం లో కూడా ఇదే జరిగింది. ఇక ఆంధ్ర ప్రదేశ్ లో ఎలాగో పది రోజుల తర్వాత టికెట్ రేట్స్ మాములు స్థితికి వచ్చేస్తాయి.
సమస్య మొత్తం తెలంగాణ ప్రాంతం లోనే ఉంది. సిటీ లో వీకెండ్స్ ఎక్కువ రేట్స్ ఉన్న పర్లేదు, బ్రేక్ ఈవెన్ కోసం అలా చేస్తున్నారు కాబోలు అని అనుకోవచ్చు. కానీ తెలంగాణ జిల్లాల్లో కూడా అదే రేంజ్ రేట్స్ అంటే సినిమాకి వచ్చే వసూళ్లు కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది. మరి బయ్యర్స్ రేట్స్ తగ్గిస్తారో లేదో చూడాలి.