స్టాక్ మార్కెట్ సూచీలు ఎన్నడూ లేని విధంగా మన భారత్ లో దూసుకుపోతున్నాయి. ముంబై స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ సెన్సెక్స్ కేవలం రెండు సెషన్స్ లో 2 వేల పాయింట్స్ కి పైగా పెరగడం అందరిని షాకి కి గురి చేసింది. శుక్రవారం నాడు సెన్సెక్స్ ఏకంగా 970 పాయింట్స్ పెరిగాయి. దీనితో టోటల్ గా 71,484 పాయింట్స్ వద్ద సెన్సెక్స్ ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ చేంజ్ సూచీ నిఫ్ట్య్ 274 పాయింట్స్ లాభం తో 21 వేల 457 వద్ద స్థిరపడింది.
స్టాక్ ఎక్స్ చేంజ్ లో ఈ స్థాయి దూకుడు కనిపించడానికి ప్రధాన కారణం ఐటీ కంపెనీలే అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. టీసీఎస్, ఇన్ఫోసిస్ , హెచ్సీఎల్ , విప్రో ఇలా ప్రముఖ MNC కంపెనీల షేర్స్ బాగా పుంజుకుంటున్నాయి. అందువల్ల మార్కెట్ లో కొనుగోళ్లు భారీగా జరుగుతున్నాయి. ఐటీ స్టాక్స్ ఈ స్థాయిలో పెరగడానికి ప్రధాన కారణం అమెరికా ఫెడరల్ రిసర్వ్ చేసిన ఒక ప్రకటన వల్లే అని అంటున్నారు నిపుణులు.
హెలికాప్టర్ లో తిరిగిన ఏకైక IAS
ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు వరుసగా వడ్డీ రేట్లు పెంచుకుంటూ వచ్చిన ఫెడ్, ఆ తర్వాత వరుసగా మూడవసారి ఎలాంటి మార్పులు చెయ్యకుండా అలాగే ఉంచుతున్నట్లు ప్రకటించింది. అలాగే 2024 సంవత్సరంలో ఏకంగా 3 సార్లు వడ్డీ రేట్లు తగ్గిస్తామని సంకేతాలు కూడా ఇచ్చింది.ఇదే సమయంలో మరోపక్క రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా వడ్డీ రేట్లు తగ్గించబోతున్నట్టు వార్తలు వస్తున్నాడు.
దీంతో స్టాక్స్ విషయం లో రానున్న రోజుల్లో మరింత పుంజుకుంటాయని అంచనా వేస్తున్నారు. దాని ప్రభావం వల్లే ఐటీ స్టాక్ మార్కెట్ ఈ స్థాయిలో పెరిగిందని చెప్పొచ్చు.ఫెడ్ ప్రకటన తర్వాత ఐటీ మార్కెట్ లో 3 శాతం వరకు స్టాక్స్ పుంజుకున్నాయి. ఇక ఆ తర్వాత శుక్రవారం రోజు ఇంకాస్త ఎక్కువ పుంజుకోవడం గమనార్హం. వీటిల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇవాళ 5.28 శాతం పెరిగి రూ. 3861 వద్ద సెషన్ ముగించింది. హెచ్సీఎల్ టెక్నాలజీస్ షేరు 5.42 శాతం పెరిగి రూ. 1491.30 వద్ద ముగిసింది.
ఇన్ఫోసిస్ షేరు 5.13 శాతం వృద్ధి చెంది రూ .1578.40 వద్ద ముగిసింది. టెక్ మహీంద్రా షేరు 3 శాతానికిపైగా ఎగబాకి రూ. 1306.10 వద్ద ఉంది. ఇక విప్రో కూడా 3 శాతం వరకు పెరిగి రూ. 446.55 వద్ద సెషన్ ముగించింది. మిగతా చిన్న చిన్న ఐటీ కంపెనీల స్టాక్స్ కూడా భారీగా ఎగబాకాయి. రానున్న రోజుల్లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.