మన భారత ఇతిహాసాల్లో ఎన్ని సార్లు విన్నా చూసిన తనిమితీరని గాథల్లో మహాభారతం ఒకటి. ఇప్పటి వరకు మహాభారతం పై ఎన్నో సినిమాలు మరియు సీరియల్స్ వచ్చాయి.
ఒకప్పుడు ఎన్టీఆర్ కేవలం వీటిమీదనే సినిమాలు తీస్తుండేవాడు. ఆయన మహాభారతం లో తీసినన్ని పర్వాలు ఇండియా లో ఏ హీరో కూడా తియ్యలేదనే చెప్పాలి.
అయితే నేటి తరం లో మహాభారతం మీద ఒక పూర్తి స్థాయి సినిమా ఇప్పటి వరకు రాలేదు. ఎవ్వరూ అంత సాహసం కూడా చేయలేకపోయారు.
చేసిన కూడా అవన్నీ విఫల ప్రయత్నాలు అయ్యాయి. అందుకే దర్శక ధీరుడు రాజమౌళి నా విజన్ లో ఉన్న మహాభారతం తీస్తే ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు క్రియేట్ అవుతాయి.
కేవలం ఒక్క పార్ట్ లో చెప్పే కథ కాదు అది. కనీసం ఆరు సినిమాలుగా తియ్యాలి అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే రీసెంట్ గా ప్రముఖ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, రాజమౌళి మహాభారతం తీస్తే ఎవరెవరు ఎలాంటి పాత్రల్లో కనిపించాలి అనేది చెప్తాడు.
శ్రీ కృష్ణుడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు, అర్జునుడిగా రామ్ చరణ్, కర్ణుడిగా పవన్ కళ్యాణ్, ధర్మరాజు గా చిరంజీవి, భీముడిగా ఎన్టీఆర్ మరియు దుర్యోధనుడిగా మోహన్ బాబు నటిస్తే అదిరిపోతోంది ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.
నిజంగా రాజమౌళి ఈ క్యాస్టింగ్ తో సినిమా తీస్తే మాత్రం ఇండస్ట్రీ రికార్డ్స్ షేక్ అవుతాయనే చెప్పాలి. అంత బాగానే ఉంది కానీ, పౌరాణిక పాత్రలకు రోల్ మోడల్ లాంటి ప్రభాస్ కి ఎలాంటి పాత్ర ఇవ్వలేదేంటి.
అంటే ప్రశాంత్ వర్మ దృష్టిలో ప్రభాస్ మహాభారతం కి పనికిరాడా అని ప్రశ్నిస్తున్నారు నెటిజెన్స్. కానీ రాజమౌళి కి ఎవరికీ ఎలాంటి పాత్ర ని ఇవ్వాలో బాగా తెలుసు.
ఆయన మహాభారతం తీస్తే కచ్చితంగా కర్ణుడు లేదా అర్జునిడి పాత్రని ప్రభాస్ కి ఇస్తాడని అంటున్నారు నెటిజెన్స్. ధర్మ రాజు పాత్ర కి పవన్ కళ్యాణ్ ని షిఫ్ట్ చేసి, కర్ణుడి పాత్రకి ప్రభాస్ ని పెట్టి ఉంటే ప్రశాంత్ వర్మ ఊహ పర్ఫెక్ట్ గా ఉండేది అని అంటున్నారు.
ఎందుకంటే ఇప్పుడు ఉన్న హీరోలలో అందరికంటే పెద్ద పవన్ కళ్యాణ్. దానికి తోడు ‘హరి హర వీరమల్లు’ సినిమాలో పవన్ కళ్యాణ్ గెటప్ ధర్మరాజు తో పోలి ఉంటుంది. అందుకే ఆ పాత్రకి పవన్ కళ్యాణ్ ని బదిలీ చెయ్యాలని అంటున్నారు ఫ్యాన్స్.