రామ్‌గోపాల్ వర్మ… శివ సినిమాతో ఎంత సంచలనం సృష్టించాడో… భారతీయ సినిమా పరిశ్రమకు బాగా తెలుసు. ఆ తర్వాత క్షణక్షణం… హిందీలో చేసిన రంగీలా వర్మ క్రేజ్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లాయి. మన దేశంలో టాప్ డైరెక్టర్స్ పేరు చెప్పాలంటే అందులో వర్మ పేరు ఖచ్చితంగా ఉండాల్సిందే.
అంతటి టాప్ టెక్నీషియన్ హోదాను పొందిన వర్మ రాను రాను తన క్రేజ్‌కు తానే పాతరేసుకున్నాడు. తాగుడు, అమ్మాయిలతో తిరగడం. ఇలా దారి తప్పాడు.. అంతేనా ఇంకా అనేక వివాదాల్లో ఇరుక్కున్నాడు కూడా.
నన్నెవడ్రా నిషేధించేది అంటున్న సురేష్ కొండేటి
ఒకప్పుడు అద్భుతమైన సినిమాలు తీసిన వర్మ ఇటీవల కాలంలో సి గ్రేడ్ దర్శకుడిగా మారిపోయాడు. కేవలం అడల్ట్ కంటెంట్‌తో కోట్లు పోగేసుకోవటానికి అలవాటు పడిపోయాడు. అంతేనా రాజకీయాలపై కూడా దృష్టి మరల్చి సినిమాలు రూపొందిస్తున్నాడు.
వర్మ పొలిటికల్ మూవీస్ అన్నీ చంద్రబాబు, పవన్‌లకు వ్యతిరేకంగా జగన్‌కు అనుకూలంగా మాత్రమే ఉంటాయనేది బహిరంగ రహస్యం.
వర్మ తాజాగా రూపొందిస్తున్న సినిమా ‘వ్యూహం’. నిర్మాత కోనేరు కిరణ్ కుమార్. ‘‘ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితం.. ఎవరినీ ఉద్దేశించినవి కావు’’ అని టైటిల్స్‌లో వేసినప్పటికీ ఇందులోని పాత్రధారులు అచ్చం చంద్రబాబును, జగన్‌ను, పవన్‌ను, భారతిని పోలి ఉండటం విశేషం.
ఇంతా చేసి రియాల్టీగా సినిమా తీస్తాడా అంటే ఆ బుర్రకు ఏం తోస్తే అదే తీస్తాడు. 2019 ఎన్నికలకు ముందు కూడా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అంటూ సినిమా తీస్తే చంద్రబాబు ప్రభుత్వం ఆ సినిమాను విడుదల కాకుండా చేసింది.
తాజాగా 2024 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసిన ఈ తాజా ‘వ్యూహం’కు సిటీ సివిల్ కోర్ట్ బ్రేకులు వేసింది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడాన్ని, ఇందులోని పాత్రలు తమ కుటుంబ సభ్యులను పోలి ఉండటాన్ని నిరసిస్తూ నారా లోకేష్ కోర్టులో కేసు దాఖలు చేశారు.
ఈరోజు కేసును విచారించిన విజయవాడ సిటీ సివిల్ కోర్టు ‘వ్యూహం’ సినిమాను థియేటర్స్లోగానీ, ఓటీటీలో గానీ ఇతర ఏ ప్లాట్ఫామ్స్మీద ప్రదర్శించకూడదని తీర్పును ఇస్తూ కేసును ఈనెల 27కు వాయిదా వేసింది. 2024లో మరోసారి జగన్‌ను సీఎంను చేయాలనే కలలు కంటున్న వర్మ ఆశ నెరవేరుతుందో లేదో చూడాలి.