ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలు షారూఖ్‌ఖాన్ నటించిన ‘డంకీ’, ప్రభాస్ నటించిన ‘సలార్’. ఈరోజు షారూఖ్ నటించిన ‘డంకీ’ విడుదల అవగా, రేపు ‘సలార్’ భారీ స్థాయిలో విడుదల కానుంది.
కేజీఎఫ్ సిరీస్‌తో దక్షిణాది చిత్రాలకు ఓ రేంజ్‌ను క్రియేట్ చేసిన దర్శకుడు ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో భారీ చిత్రాల నిర్మాణ సంస్థ హోంబలే పిక్చర్స్ ఈ చిత్రాన్ని దాదాపు 400కోట్ల రూపాయలతో నిర్మించినట్లు చెపుతున్నారు. శృతిహాసన్ కథానాయిక.
ఒక్క రాత్రిలో ‘సలార్’ రికార్డ్స్ చూస్తే నోరెళ్లబెడుతారు
పృథ్వీరాజ్ మరో ముఖ్యపాత్రను పోషించారు. రెండు భాగాలుగా ఈ చిత్రం రానుంది. శుక్రవారం తొలి భాగం విడుదల కానుంది. అయితే ప్రస్తుత ట్రెండ్‌కు అనుగుణంగా ఈసినిమాను మల్టీప్లెక్స్ ప్రేక్షకుల్లో బాగా ఆదరణ ఉంటుందనే ఉద్దేశ్యంతో భారీ స్థాయిలో మల్లీప్లెక్స్‌లో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేశారు నిర్మాతలు.
అయితే దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో మల్టీప్లెక్స్ స్క్రీన్‌లు కలిగిఉన్న మిరాజ్, పీవీఆర్ ఐనాక్స్ సంస్థలు ఉత్తరాదిన షారూఖ్‌ఖాన్ నటించిన ‘డంకీ’ సినిమాకు తమ స్క్రీన్‌లు మొత్తం కేటాయించేశాయి. పోనీ సింగిల్ స్క్రీన్‌లో అయినా విడుదల చేద్దాం అంటే.. అవి కూడా డంకీ కోసమే రిజర్వ్ చేయడంతో సలార్ సందిగ్ధంలో పడిరది.
దక్షిణాదిన మాత్రం మిరాజ్, పీవీఆర్ ఐనాక్స్ స్క్రీన్‌లు సలార్‌కు కేటాయించడానికి సుముఖత వ్యక్తం చేశాయట.
కానీ ఉత్తరాదిన కావాలనే తమ సినిమాను తొక్కేయడానికి డంకీకి థియేటర్స్‌ను కేటాయించి.. ఇప్పుడు దక్షిణాదిన థియేటర్స్ ఇస్తాం. అనడంపై అలిగిన సలార్ నిర్మాతలు అసలు దక్షిణాదిన మిరాజ్, పీవీఆర్ ఐనాక్స్‌ల్లో తమ సినిమాను విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నారట. ఇప్పుడు మిరాజ్, పీవీఆర్‌ల ‘సలార్’ పంచాయితీ ఎంత దూరం వెళుతుందో చూడాలి.