
తమన్నా భాటియా తన కెరీర్లో స్పెషల్ సాంగ్స్‌తో కొత్త స్థాయికి వెళ్లింది. ‘జైలర్’లోని ‘కావాలా’ పాట పెద్ద సెన్సేషన్‌గా మారిన తర్వాత ఆమెను స్పెషల్ నంబర్ల క్వీన్‌గా పిలుస్తున్నారు. ఆమె డ్యాన్స్ మూవ్స్, స్టెప్స్ యూత్‌ను విపరీతంగా ఆకర్షించాయి. ఇక తాజాగా ‘స్త్రీ 2’లో ఆమె చేసిన ‘ఆజ్ కి రాత్’ సాంగ్ మరో సంచలనంగా మారింది. ఈ పాటలో తమన్నా వేసిన స్టెప్స్ చూసిన ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఆమె బాడీ షేప్స్, స్టైల్, ఎనర్జీ కుర్రకారును ఉర్రూతలూగించాయి.
తమన్నా భాటియా గురించి కొన్ని విమర్శలు వచ్చినా, వాటిని లైట్ తీసుకుంటూ తన అందం, టాలెంట్‌తో ముందుకు సాగుతోంది. ఇటీవల ఓ ఈవెంట్లో ‘ఆజాద్’ చిత్రానికి సంబంధించి తనపై వచ్చిన కామెంట్ హాట్ టాపిక్ అయింది. ఈ సినిమాలో డెబ్యూ చేస్తున్న రాషా తడానీ తమన్నాను ‘ఆంటీ’ అని పిలిచింది. దీనిపై అనేక విమర్శలు, చర్చలు జరిగాయి. అయితే తమన్నా మాత్రం దీన్ని సింపుల్‌గా తీసుకుంది. వాస్తవానికి ఆమె లుక్, గ్రేస్ చూసిన వారెవరికీ ఆమె వయసు పెరిగిందనిపించదు. ఆమె ఫిట్నెస్ లెవెల్స్, గ్లామర్‌లో ఏ మాత్రం తగ్గుదల కనిపించదు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్నా తన శరీరాకృతి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ‘‘నా శరీరంలోని ప్రతి భాగానికి నేను థాంక్స్ చెప్తాను. నా అందానికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటాను. నేను నా శరీరాన్ని ఎంతో ఇష్టపడతాను. దీని కోసం ఎంత కష్టమైనా పడతాను. నా శరీరం నాకు ఎంత బలంగా నిలిచిందో తెలుసు, అందుకే దీని మెయింటైన్ చేయడం కోసం నేను ప్రయత్నిస్తాను’’ అంటూ చెప్పింది. ఈ మాటలు నెటిజన్లలో వైరల్ అవుతున్నాయి. తమన్నా తన అందంపై ఎంత నమ్మకంగా ఉందో ఈ వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది.
తమన్నా కెరీర్‌ని చూస్తే ‘హ్యాపీ డేస్’ సినిమాతో టీనేజ్ గర్ల్‌గా తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చింది. అప్పటి తమన్నా లుక్, ఇప్పటి లుక్ మధ్య చాలా మార్పు ఉంది. కానీ ఇప్పటికీ ఆమె ఫిట్నెస్ను మెయింటేన్ చేయడంలో హైరానా అవుతోంది. తన అందాన్ని కాపాడుకునేందుకు గట్టి కష్టపడుతుందని ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది.
ఇక వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే, తమన్నా భాటియా గత కొంతకాలంగా నటుడు విజయ్ వర్మతో డేటింగ్లో ఉందన్న వార్తలు వినిపించాయి. వీరిద్దరూ పబ్లిక్‌గా కలిసి కనిపించడంతో ఇది నిజమేననుకున్నారు. అయితే కొన్ని రోజులుగా ఈ జోడీ బ్రేకప్ అయిందనే రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. కానీ తమన్నా మాత్రం తన వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడూ మాట్లాడదనే విషయం తెలిసిందే. ఆమె కెరీర్‌పైనే పూర్తి దృష్టి పెట్టి, తన సినిమాల గురించి మాత్రమే మాట్లాడుతోంది.
ప్రస్తుతం తమన్నా సినిమాలతో బిజీగా ఉంది. స్పెషల్ సాంగ్స్, వెబ్ సిరీస్, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తన స్థాయిని పెంచుకుంటోంది. ఆమె తన అందాన్ని మెయింటేన్ చేసుకోవడంలో ఎంత శ్రద్ధ పెట్టిందో స్పష్టంగా కనిపిస్తోంది. తన పై వచ్చే విమర్శలు, పుకార్లను పట్టించుకోకుండా ఆమె కెరీర్‌పై ఫోకస్ చేస్తోంది.