ప్రస్తుత కాలం లో మనలో అనేక ఆరోగ్య సమస్యలకు గురి చేస్తున్న వాటిల్లో యూరిక్ యాసిడ్ ప్రధాన కారణంగా నిలుస్తూ వస్తుంది.
మన శరీరం లోని రక్తం లో యూరిక్ యాసిడ్ అధిక స్థాయిలో ఉండడాన్ని హైపర్యూరిసెమియా అంటారు. దీనివల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడం ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఏర్పడడానికి కారణం అవుతుంది.
మనం తినే కొన్ని ఆహార పదార్దాలలో ప్యూరిన్లు కనిపిస్తాయి. ఈ ప్యూరిన్స్ రక్తం లో కరిగిపోయినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ప్రస్తుతం శీతాకాలం నడుస్తుంది.
ఎముకలు కొరికే చలి ఉన్న ఈ నేపథ్యం లో కొన్ని పదార్దాలను మనం సేవిస్తాము. ఆ పదార్దాల కారణంగా యూరిక్ యాసిడ్ మన ప్రమేయం లేకుండానే శరీరంలో ఏర్పడుతుంది. అలాంటి పదార్దాలను పూర్తిగా నివారించాలని ప్రముఖ పోషకాహార నిపుణుడు ప్రియాంషి భట్నాగర్ సూచిస్తున్నాడు.
ఆయన చెప్తున్న సమాచారం ప్రకారం యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచే ప్యూరిన్లు ఎక్కువగా రెడ్ మీట్లో ఉంటాయి. ఇది ఇలా ఉండగా ఆంకోవీస్, సార్డినెస్, క్లామ్స్, స్కాలోప్స్ వంటి సీఫుడ్‌లలో ప్యూరిన్ల శాతం చాలా ఎక్కువగా ఉంటుంది.
ముఖ్యంగా చలికాలంలో వీటిని తినడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయి అమాంతం పెరుగుతుంది. ఇక పోతే జంతువుల శరీర భాగాలు కొన్ని తినడం వల్ల కూడ యూరిక్ యాసిడ్ పెరగడానికి కారణం అవుతాయి. జంతువుల కాలేయం, మూత్రపిండాలు వంటి అంతర్గత భాగాల్లో ప్యూరిన్లు అధికంగా ఉంటాయి.
చలికాలం లో ఎక్కువగా మనం వేడివేడిగా చేసే మాంసాహారం ని తినేందుకు ఇష్టపడుతాము. అలా చెయ్యడం వల్ల ప్యూరిన్లు ఒక రేంజ్ లో మన శరీరం లోకి ప్రవేశించి యూరిక్ యాసిడ్ ఏర్పడడానికి కారణం అవుతాయి.
అలాగే ఈ చలికాలంలో చక్కెర పదార్దాలతో నిండిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచే అవకాశం ఉంటుంది.
ఇకపోతే చలికాలం లో చాలా మంది అల్కోహాల్ ని సేవిస్తూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం, ముఖ్యంగా బీర్ తాగడం వల్ల యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరిగి డీహైడ్రేషన్ రిస్క్ పెరుగుతుంది.
ఇకపోతే కొన్ని కూరగాయలకు కూడా దూరంగా ఉండడం మంచిది అట. ఉదాహరణకి బచ్చలికూర, ఆస్పరాగస్ , కాలీఫ్లవర్ వంటివి ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం అయ్యినప్పటికీ వాటిల్లో మితమైన ప్యూరిన్లను కలిగి ఉంటాయి,
వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ అధికంగా ఉండే సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. అలాగే పిండివస్తువులతో తయారు చేసిన పదార్దాల నుండి కూడా యూరిక్ యాసిడ్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకి వైట్ బ్రెడ్, పాస్తా వంటి ఫుడ్ ఐటమ్స్ వల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతుందట.