మొత్తానికి తండ్రిపై ఉన్న అభిమానంతో ఆంధ్రప్రజానీకం జగన్‌కు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని చేతులారా కాలరాసుకుంటున్నారు.
అధికారంలోకి వచ్చింది మొదలు కూల్చివేతలే ప్రధాన అజెండాగా పనిచేయడం మొదలు పెట్టిన జగన్ అతి తక్కువ సమయంలోనే తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకున్నాడు.
కేవలం సంక్షేమ పథకాలనే నమ్ముకుని మిగిలిన విషయాలను గాలికొదిలేశాడు. దీంతో రాష్ట్రంలో అభివృద్ధి అనేది కనిపించకుండా పోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దీన్నుంచి తప్పించుకుని మరోసారి సీఎం పీటం ఎక్కడం కోసం ఆయన అభ్యర్ధులు మార్పు ప్రక్రియను ఎంచుకున్నారు. ఇది కాస్తా బెడిసికొట్టి వైసీపీ నేతలు ప్రతిపక్ష నాయకుల పంచన చేరుతున్నారు.
ఈ టికెట్ నిరాకరణకు ఇప్పుడు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కూడా బలయ్యారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం అయిన మాగుంట ఫ్యామలీ నుంచి గతంలో ఆయన అన్న, దివంతగ మాగుంట సుబ్బరామిరెడ్డి పార్లమెంట్ సభ్యునిగా పనిచేశారు.
ఆ తర్వాత ఆయన భార్య మాగుంట పార్వతమ్మ కూడా ఒకసారి ఎంపీగా, ఒకసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదే కుటుంబం నుంచి మాగుంట సుబ్బరామిరెడ్డి సోదరుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రస్తుతం ఒంగోలు పార్లమెంట్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
ఎంపీగా ఎన్నికవ్వడం ఆయనకు ఇది 4వ సారి. ఒకసారి ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. సౌమ్యుడు, మిత భాషి అయిన ఈయన్ను ఒంగోలు పార్లమెంట్ స్థానంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రెస్‌మీట్‌లు పెట్టి చంద్రబాబును, లోకేష్‌ను, పవన్ కల్యాణ్‌ను తిట్టాలని, ఆ తర్వాతే తన దగ్గరకు టికెట్ కోసం రావాలని జగన్ షరతు విధించారట.
ఈ విషయం బాలినేని ద్వారా తెలుసుకున్న మాగుంట శుక్రవారం పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ అయిన విజయసాయిరెడ్డిని కలిసి ‘‘నేను ఈ తరహా తిట్ల రాజకీయాన్ని ఎప్పుడూ అనుసరించలేదు. ఇది మంచి పద్ధతి కూడా కాదు. మనం గెలవాలంటే ప్రజలకు ఏం చేశామో చెప్పాలి.
వీలైతే చూపించాలి. అంతే కానీ ఇలా అపొజిషన్‌ను వాళ్లను తిట్టడం ఏమిటి? ఇది మంచి పద్ధతి కాదు. వెళ్లి జగన్‌కు చెప్పండి’’ అనేసి వెళ్లిపోయారట. ఇది జరిగిన కొద్ది సేపటికే జగన్ ఒంగోలు ఎంపీ స్థానం నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డిని పోటీ చేయాల్సిందిగా ఆదేశించినట్లు తెలుస్తోంది.