గ్రీన్ టీ ప్రయోజనాలే మనకు సాధారణంగా తెలుసు కానీ గ్రీన్ కాఫీతో కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. గ్రీన్ టీ ముఖ్యంగా చెడు కొలస్ట్రాల్ కణాలపై ప్రభావం చూపి ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది. బాడీ మాస్ ఇండెక్స్ ను క్రమపద్ధతిలో ఉంచుతుంది.
ఇక గ్రీన్ కాఫీ విషయానికి వస్తే
దీన్ని కాల్చని కాఫీ బీన్స్ నుంచి తయారు చేస్తారు. ఇందులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. తయారీలో ప్రధానంగా బ్రోకలీని వినియోగిస్తారు. బ్రోకలీని పొడిచేసి దాంతో కాఫీని తయారు చేస్తారు.
ప్రయోజనాలు
రెగ్యులర్ గా ఈ కాఫీని తాగితే బ్లడ్ లో షుగర్ లెవల్స్ బ్యాలెన్స్ గా ఉంటాయి. డయా బెటిస్ ను రానీయకుండా ఇది కొంత మేరకు అడ్డుకుంటుంది. దీని గింజల్లో క్రోనాలజిల్ ఆసిడ్ ఉంటుంది కాబట్టి ఇది ప్రధానంగా జీర్ణ శక్తిపై ప్రభావం చూపి మెరుగుపరుస్తుంది.
హైబీపీతో బాధపడేవారు దీన్ని తీసుకుంటే కంట్రోల్లో ఉంటుంది. గుండెపోటు సమస్యలను ఇది చాలా వరకు అడ్డుకుంటుంది. యాంటీ యాక్సిడెంట్లు అధికంగా ఉండడం వల్ల శారీరక రక్షణ వ్యవస్థ (ఇమ్యునిటీ పవర్) ఉంటుంది. గ్రీన్ కాఫీతో ఊబకాయానికి కూడా చెక్ పెట్టవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసమే.. సమస్యలపై తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలి.