చలి కాలం మొదలైంది, రోజురోజుకీ ఉష్ణోగ్రతలు దారుణంగా తగ్గిపోతున్నాయి. ముఖ్యంగా పగటి పూట ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుతున్నాయి. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని జనాలు తీవ్రమైన ఇక్కట్లను ఎదురుకుంటున్నారు.
ఈ చలికాలం సమయం లోనే అనేకమైన అనారోగ్య సమస్యలు వస్తుంటాయి, ముఖ్యంగా ముసలి వయస్సు ఉన్న వాళ్ళు ఎక్కువగా చనిపోతూ ఉంటారు.
అంతే కాకుండా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో మొదలై ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఈ కాలంలో వెంటాడుతుంటాయి. వీటితో పాటుగా గుండెకి సంబంధించిన వ్యాధులు కూడా ఈ సమయం లో వస్తుంటాయి.
ముఖ్యంగా బీపీ పేషెంట్స్ చలికాలం చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తుంటారు. నాడీ వ్యవస్థపై చలి చూపించే ప్రభావం రక్త నాళాలపై పడి గుండె పోటు వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే ఈ సమస్య నుంచి బయటపడాలంటే ప్రతీ రోజు ఉదయం జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ ఆ మార్పులు ఏంటో ఒకసారి చూద్దాము.
* చలికాలం చాలా మంది మంచి నీళ్లు తాగడం పూర్తి తగ్గించేస్తుంటారు. అయితే కాలం ఏదైనా నీటిని తాగడం మాత్రం ఆపొద్దని నిపుణులు చెబుతున్నారు.
చలికాలంలో నీరు తక్కువ తాగడం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని చెబుతున్నారు. కాబట్టి ఉదయం నిద్రలేచిన వెంటనే గోరు వెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి.
*సాధారణంగా చలికాలం అనగానే శారీరక శ్రమ తగ్గించేస్తు ఉంటాము. రెగ్యులర్ గా వాకింగ్, జాగింగ్ చేసే వారు కూడా చలి కారణంగా ఇంట్లోనే ఉండిపోతారు. అయితే శరీరాన్ని వేడెక్కించేందుకు వ్యాయామాలు నిత్యం చేయాలట.
ఇంట్లో అయినా చిన్నచిన్న వర్కవుట్స్ చేయాలని సూచిస్తున్నారు. స్ట్రెచ్చింగ్ వంటి వ్యాయామాల ద్వారా రక్త సరఫరా పెరిగి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
చలికాలంలో సాధరాణంగా సూర్యరక్ష్మి ఉండదు. ఈ కారణంగానే విటమిన్ డీ లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. విటమిన్ డీ లోపం గుండె పనితీరుపై ప్రభావం చూపుతుందని ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలింది.
ఈ నేపథ్యంలోనే తీసుకునే ఆహారంలో విటమిన్ డీ ఎక్కువగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. హృదయనాళ సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉండడంలో విటమిన్ డీ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.