బళ్లు ఓడలు.. ఓడలు బళ్లు అవ్వడం రాజకీయాల్లో కామన్ థింగ్. అధికార మార్పిడి అనేది ఒక సైక్లింగ్. తాజాగా తెలంగాణలో 10 ఏళ్ల బీఆర్‌ఎస్ పాలనపై ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. బీఆర్‌ఎస్ పాలనలో హైదరాబాద్ నగరంలో జరిగిన అభివృద్ధికి నగర ఓటర్లు సంతృప్తి చెందటంతో ఏకపక్ష తీర్పు బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఇచ్చారు. అయినప్పటికీ ఓవరాల్‌గా ప్రజలు కాంగ్రెస్‌ను గద్దెమీద కూర్చోబెట్టారు.
అయితే అసలు అభివృద్ధి అనే పేరు వినపడని ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి ఎలా ఉంటుంది.. ప్రస్తుతం గాలి ఎటువైపు వీస్తోంది అనే చర్చ వస్తే ఏపీలో జరుగుతోంది. ఇటీవల 11 మంది అభ్యర్ధులను మారుస్తూ జగన్ నిర్ణయం తీసుకోవడం. రాబోయే రోజుల్లో 60 నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలను మార్చే అవకాశాలు పుష్కలంగా ఉండటం రాజకీయ వర్గాల్లో కాక రేపుతోంది. దీంతో మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల ప్రభావం పక్కరాష్ట్రమైన ఏపీపై ఉంటుందా అనేది చర్చ.
20 మంది వైసీపీ ఎమ్యెల్యేలు జంప్
ఎలక్షన్స్‌లో ఎప్పుడూ ప్రభుత్వ వ్యతిరేకత అనేది రెండు లెవల్స్‌లో పనిచేస్తాయి. ఒకటి ముఖ్యమంత్రి పనితీరు. రెండోది ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు. తెలంగాణలో అమలులో ఉన్న డబుల్‌బెడ్‌రూం, దళితబంధు, రైతు బంధు వంటివి సెలక్టివ్ పథకాలు. ఆదే అంధ్రప్రదేశ్‌ను తీసుకుంటే అక్కడ పథకాల్లో చాలా పథకాలు యూనివర్సల్ అంటే అందరికీ సంబంధించినవి.
సో అక్కడైనా.. ఇక్కడైనా ఆయా పథకాల లబ్ధిదారుల సంఖ్య ఎంత ఉంటుందో… ఈ పథకాలు అందనివారి సంఖ్య, వీటిని వ్యతిరేకించే వారి సంఖ్య కూడా తక్కువేం ఉండదు. అయితే ఎంత అప్పులు తెస్తున్నారు. ఎంత అకౌంట్‌లలో వేస్తున్నారు.. వీటి మధ్య భారీ వ్యత్యాసం ఉంది అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి అది వేరే చర్చ.
తెలంగాణలో డబుల్‌బెడ్‌రూం, దళిత బంధు, కల్యాణలక్ష్మి వంటి పథకాల్లో లంచాలు కీలక పాత్ర పోషించాయి అనేది బహిరంగ రహస్యం. ఆంధ్రాలో పథకాలు బటన్ నొక్కి నేరుగా అకౌంట్‌లో వేయడం జరుగుతోంది. దీనిమీదే జగన్ ఆశలు పెట్టుకున్నారు. అయితే కేవలం సంక్షేమమే చూస్తే సరిపోదు. అలాగే తెలంగాణలో రేవంత్‌రెడ్డి రాక కాంగ్రెస్ పార్టీ పరుగుకు బాగా హెల్ప్ అయ్యింది.
ఆంధ్రాలో తెలుగుదేశం బలమైన పునాదులపై ఉన్నప్పటికీ, జగన్ అనుసరించిన కక్షసాధింపు చర్యలతో కొంత ఢీలా పడిరది. దీనికి జనసేన మద్దతు అనేది కొత్త ఉత్సాహం తెచ్చిపెట్టింది. కాబట్టి తెలంగాణ ఎన్నికల్లో 4 నెలలకు ముందు కాంగ్రెస్‌కు అంతపెద్ద పాజిటివ్‌నెస్ లేదు. కానీ నాలుగు నెలల్లోనే దూసుకుపోయి అధికారం కైవసం చేసుకుంది. సో.. ఆంధ్రాలో జగన్ నమ్ముకుంది కేవలం సంక్షేమం పేరుతో తాను పంచుతున్న డబ్బునే.
చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు నమ్ముకుంది తమ మధ్య కుదిరిన పొత్తు, ప్రభుత్వ వ్యతిరేకత తమ కూటమికి లాభిస్తుందనే విషయాన్ని మాత్రమే. ఎన్నికలకు 2 నెలలు ముందు జరగబోయే పరిణామాలు కీలక ఫ్యాక్టర్ అవుతాయని చాలాసార్లు నిరూపితం అయ్యింది. మరో నెల గడిస్తే గానీ గాలి స్థిరత్వం ఎటువైపుకు మొగ్గుతుందో తెలుస్తుంది.