చట్టాన్ని అతిక్రమిస్తూ, పోలీస్ వారి విన్నపం ని లెక్క చెయ్యకుండా వ్యవహరించినందుకు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ ని రీసెంట్ గానే హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి, చంచల్ గూడ జైలుకు తరలించిన సంగతి మన అందరికీ తెలిసిందే.
బిగ్ బాస్ టైటిల్ ని గెలిచిన ఆనందం కనీసం 24 గంటలు కూడా లేకుండా పోయింది అని పల్లవి ప్రశాంత్ అభిమానులు మరియు కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు. జైలు లాంటి బిగ్ బాస్ హౌస్ లో మూడు నెలలకు పైగా గడిపి, ఇప్పుడు నిజమైన జైలుకి వెళ్ళాడు అంటూ ఆయన అభిమానులు ఎమోషనల్ గా పోస్టులు పెడుతున్నారు.
మరో పక్క రూల్స్ ని అతిక్రమించి ఓవర్ యాక్షన్ చేసినందుకు పల్లవి ప్రశాంత్ కి పడాల్సిన శిక్షనే పడింది, అతనిని దండించడం లో ఎలాంటి తప్పు లేదు అంటూ మరికొంతమంది నెటిజెన్స్ అంటున్నారు.
పల్లవి ప్రశాంత్ కి14 రోజులు రిమాండ్
ఇది ఇలా ఉండగా బిగ్ బాస్ హౌస్ లో మొదటి వారం నుండి పల్లవి ప్రశాంత్ కి సపోర్టు గా నిలుస్తూ, అతని ప్రతీ కష్టసుఖాలను పంచుకున్న శివాజీ, నేడు అరెస్ట్ విషయం లో అసలు స్పందించలేదని సోషల్ మీడియా లో కొంతమంది నెటిజెన్స్ శివాజీ ని తప్పుబట్టారు.
దీనిపై శివాజీ మాట్లాడుతూ ‘అందరికీ నమస్కారం..పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యినప్పటి నుండి సోషల్ మీడియా లో వస్తున్న కామెంట్స్ చూస్తున్నాను. ప్రశాంత్ అరెస్ట్ అయ్యినప్పటి నుండి ఇప్పటి వరకు అతనికి సంబంధించిన ప్రతీ సమాచారం నా దగ్గర ఉంది.
ఇది నేను ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ తల్లితండ్రులతో నేను టచ్ లో ఉన్నాను. రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే సోమవారం లోపు వాడు బయటకి వచ్చేస్తాడు. ప్రశాంత్ ఎలాంటి తప్పు చెయ్యలేదని నేను బలంగా నమ్ముతున్నాను.
వాడు రూల్స్ ని అతిక్రమించే వ్యక్తి కాదు, నాలుగు నెలలు నేను బిగ్ బాస్ హౌస్ లో వాడితో కలిసి ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. వాడు నిర్దోషిగానే బయటకి వస్తాడు’ అంటూ శివాజీ రియాక్ట్ అయ్యాడు. మరోపక్క ప్రశాంత్ బైలు కేసు ప్రస్తుతానికి వాయిదా పడింది.
సోమవారం రోజు విచారణకి రాబోతుంది. తమకి పాజిటివ్ గా తీర్పు వస్తుందని పల్లవి ప్రశాంత్ తల్లితండ్రులు ఆశిస్తున్నారు. చూడాలి మరి ఈ కేసు ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుందో అనేది.