కేంద్ర వెసులుబాటుతో నిమ్మగడ్డకు ప్రభుత్వం చెక్‌ పెడుతుందా?

0
520

ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త ట్రెండ్‌ నడుస్తోంది. గతంలో పాలక, ప్రతిపక్ష పార్టీ లు ఒకరినొకరు తిట్టి పోసుకోవడం, ఒకరిని ఒకరు ఓడిరచుకోవడానికి వివిధ రకాల ఎత్తులు, పైఎత్తులు వేయడం రివాజు. కానీ ప్రస్తుతం ప్రభుత్వం దానిలో భాగమైన రాజ్యాంగ వ్యవస్థల మధ్య అనూహ్యమైన పోరు నడుస్తోంది. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలైన రాజ్యాంగ వ్యవస్థ లు ప్రభుత్వంలో అంతర్భాగంగా ఉంటూ తమ విధు తాము నిర్వహించడం సహజంగా జరిగేవే.

అయితే ఇటీవల కొందరు అధికారులు పార్టీ పరంగా, సామాజిక పరంగా వ్యత్యాసాలు చూపించడం మొద లు పెట్టడంతో పరిస్థితి మరింత ముదిరి ఏకంగా ప్రభుత్వం, దాని అనుసంధానకర్తలైన రాజ్యాంగ వ్యవస్థ లు ఒకదానిపై ఒకటి పై చేయి సాధించాలనే కాంక్షతో ఏకంగా రాజ్యాంగానే అపహాస్యం చేస్తున్నారు. ఈ తరహా పోరును తారాస్థాయికి తీసుకు వెళ్లింది స్టేట్‌ ఎక్షన్‌ కమిషన్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ అని చెప్పాలి.
లోకల్‌బాడీ ఎన్నిక నిర్వహణ విషయంలో ఈయన అధికార పార్టీకి కొరకరాని కొయ్యగా మారారు. అధికార వైసీపీ ఈయన్ను టీడీపీ తొత్తుగా అభివర్ణిస్తూ ఆయనకు సహాయ నిరాకరణ మొద లు పెట్టింది.

ఈయన సైతం అంతే స్థాయిలో తనకు వీలైన అన్ని మార్గాల ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. కరోనా విజృంభణకు ముందు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సంసిద్ధం అవ్వగా, కరోనాను కారణంగా చూపి కనీసం ప్రభుత్వంతో సంప్రదించకుండానే ఎన్నికను వాయిదా వేశారు నిమ్మగడ్డ. ఈ విషయంలో ప్రభుత్వం ఆయన వైఖరిపై చాలా సీరియస్‌ అయిన సంగతి తెలిసిందే. అనంతరం నిమ్మగడ్డ, ఏపీ ప్రభుత్వం కోర్టు గుమ్మం తొక్కారు.

కరోనా కేసులు వేళ్లమీద లెక్కపెట్టే స్థాయిలో ఉన్నప్పుడు దాన్ని బూచిగా చూపి లోక్‌బాడీ ఎలక్షన్స్‌ను వాయిదా వేసిన ఎస్‌ఈసీ నిమ్మగడ్డ, ఇప్పుడు అదే కరోనా రూపం మార్చుకుని మరోసారి విజృంభిస్తున్న తరుణంలో ఎన్నికను నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని రెచ్చగొడుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఎన్నికల నిర్వహించడానికి కుదరదని ప్రభుత్వం కూడా నిమ్మగడ్డకు తెగేసి చెప్పింది. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ఎస్‌ఈసీ ఎన్నికలనిర్వహణ కోసం కోర్టు సాయంతో ముందుకు వెళ్లాలని చూస్తున్నారు.

తాజాగా కేంద్రం ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ఏపీ ప్రభుత్వానికి అనుకోని వరంలా మారింది. కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న తరుణంలో కేంద్రం కొన్ని ఆంక్షలను విధించింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పరిస్థితిని బట్టి నిర్ణయా లు తీసుకునేలా వెసులుబాటును కల్పించింది. ఈ వెసు లు బాటుతో వీలైనంత త్వరగా లోకల్‌బాడీ ఎన్నికలు నిర్వహించాలనే తహతహలాడుతున్న ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు ఏపీ ప్రభుత్వం చెక్‌ పెట్టడానికి సన్నద్ధం అవుతున్నట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు నిర్వహించాలని నిమ్మగడ్డ.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికలు నిర్వహించకూడదని ప్రభుత్వం ఆడుతున్న గేమ్‌లో ఎవరు విన్నరో వేచి చూడాల్సిందే.