అరకు కాఫీకి ఆ పేరు పెట్టింది నేనే..

0
207
Araku Coffee was named by me chandrababu naidu
Araku Coffee was named by me chandrababu naidu

అరకు కాఫీకి ఆ పేరు తానే పెట్టానని అన్నారు తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబు. అరకులో జరుగుతున్న రా.. కదలిరా కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. ఇంకా ఆయన మాట్లాడుతూ…

గిరిజన పిల్లలు చదువు విషయంలో ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో నేను చర్యలు తీసుకున్నా. ఇక్కడ చదువు చెప్పే విషయంలో కూడా సరైన ఉపాధ్యాయు లేరు అని,

ఇక్కడి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని టీచర్‌ ట్రైనింగ్‌ వంటి అర్హతల నుంచి గిరిజన ఉపాధ్యాయులకు మినహాయింపు ఇచ్చాను. నేను ఇచ్చిన జీవో నెం.3ని ఎందుకు రద్దు చేశారో చెప్పగలరా?

ఇది అన్యాయమా కాదా అని అడుగుతున్నా. ఇది గిరిజనులకు ద్రోహం చేయడం కాదా. జాబ్‌ క్యాలెండర్‌ వచ్చిందా.. రాలేదు. ఇంకా ప్రింటింగ్‌ ప్రెస్‌లో ఉంది ఆ క్యాలెండర్‌.

గిరిజన ప్రాంతాల్లో మంచి విద్యను అందించాలని, వారికి ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఇతర మంచి చదువులు చదివించాలని మేము ఆలోచించాము.

People dont even look like mild bugs
People dont even look like mild bugs

నైపుణ్యం కోసం శిక్షణా కేంద్రాలు పెడితే వాటిని తీసేశారు. ఇప్పుడు మైదానంలోని వ్యక్తులకు ఇక్కడ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు వీరి అనాలోచిత చర్యల వల్ల కలిగేలా ఉంది.

ట్రైకార్‌లో భాగంగా గిరిజనుల కోసం కేంద్రం ఇచ్చే నిధులను కూడా తెచ్చుకోలేదు. ఇందులో భాగంగా కేంద్రం 60శాతం ఇస్తే.. రాష్ట్రం 40 శాతం ఇవ్వాలి.

ఆ 40 శాతం కూడా పెట్టకుండా చేతులెత్తేసిన చరిత్ర వీరిది. అప్పట్లో మా ప్రభుత్వంలో ఫుడ్‌ బాస్కెట్‌లు ఇచ్చాము.. దోమల బ్యాట్‌లు కూడా అందించాము. అన్నీ పీకేశారు.

మీకు 200 యూనిట్ల లోపు వాడిన విద్యుత్‌కు బిల్లు లేకుండా చేశాము. మొబైల్‌ అంబులెన్స్‌లు కూడా పెట్టాము. ఫీడర్‌ అంబులెన్స్‌లు కూడా ఉండేవి. అవి కూడా తీసేశారు. గిరినెట్‌ పేరుతో 184 టవర్స్‌ పెట్టాము. అవీ లేవు.

ఏజెన్సీలోని బాక్సైట్‌ను మేం తవ్వకూడదు అని నిర్ణయించుకున్నాము. కానీ ఇప్పుడు లేటరైట్‌ పేరుతో బాక్సైట్‌ తవ్వుకుపోతున్నారు. దీనికి వ్యతిరేకంగా తెలుగుదేశం వారు పోరాడితే కేసులు పెట్టారు.

గిరిజనుల సంపదను దోచుకునే వ్యక్తి ఈయన. గిరిజన ప్రాంతాల్లో మేం వేసిన రోడ్లు తప్ప మళ్లీ కొత్తగా వేయలేదు. గిరిజనులు అనారోగ్యంతో ఆసుపత్రులకు వెళ్లాలంటే డోలీలే దిక్కుగా మారాయి. ఇంత అనాగరికం ఎక్కడా ఉండదు అన్నారు.