అప్పట్లో ఎన్టీఆర్..ఇప్పుడు రేవంత్ రెడ్డి

0
224

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతున్న పేరు రేవంత్ రెడ్డి. తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యడానికి అహర్నిశలు కష్టపడి, బీఆర్ఎస్ పార్టీ కి కంటిమీద కునుకులేకుండా చేసి అధికారం లోకి వచ్చేలా చేసాడు. అందుకే హై కమాండ్ పార్టీ లో ఎంతో మంది సీనియర్ నాయకులను కూడా పక్కన పెట్టి రేవంత్ రెడ్డి ని ముఖ్యమంత్రిని చేసింది.

నేడు LB స్టేడియం లో రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్నాడు. ముఖ్యమంత్రి పదవి కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చాలా ఆశలు పెట్టుకున్నాడు కానీ, CCLP సమావేశం ఎమ్యెల్యేలు గా గెలిచిన ప్రతీ ఒక్కరు రేవంత్ రెడ్డి కి ముక్తకంఠం తో సపోర్ట్ చెయ్యడం తో అధిష్టానం కూడా ఆయన్నే ముఖ్యమంత్రి ని చేసింది. ఇదంతా పక్కన పెడితే రేవంత్ రెడ్డి పోరాట పటిమ, ఆయన చేసిన కృషి స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారిని గుర్తు చేసింది అంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తే అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం తప్ప మరో పార్టీ ఆధిపత్యం కొనసాగేది కాదు. దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగుతూ ఉంది. అలాంటి సమయం లో మన రెండు రాష్ట్రాల తరుపున కాంగ్రెస్ పార్టీ కి ఎదురు గా నిలబడి, తెలుగు దేశం పార్టీ స్థాపించి కేవలం ఆరు నెలల వ్యవధి లో ప్రభుత్వాన్ని స్థాపించి కాంగ్రెస్ కి చుక్కలు చూపించాడు ఎన్టీఆర్.

తమదే రాజ్యం, తాము ఏది కరెక్ట్ అనుకుంటే అదే కరెక్ట్ అనే ధోరణితో వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీ కి చెక్ పెట్టాడు ఎన్టీఆర్. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అలాంటి వాడే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత వరుసగా రెండు సార్లు అధికారం లోకి రావడం తో కేసీఆర్ కి అహంకారం తారాస్థాయికి చేరుకుంది.

కేవలం కేసీఆర్ కి మాత్రమే కాదు, ఆయన కుటుంబం లో ఉన్న వాళ్ళు మొత్తం ఇలాగే అహంకారం తో మాట్లాడడం, అహంకారం తో నిర్ణయాలు తీసుకోవడం వంటివి చేసాడు. ఇలాంటి నిర్ణయాల వల్ల జనాలకు కలిగిన నష్టాలను రేవంత్ రెడ్డి తెరపైకి తీసుకొని రావడం లో సక్సెస్ అయ్యాడు. జనాల్లో బీఆర్ఎస్ పార్టీ పై వ్యతిరేకత పెంచి, ఆ పార్టీ ని మట్టికరిపించేలా ప్రయత్నాలు చేసి సక్సెస్ అయ్యాడు. అందుకే నేడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్నాడు రేవంత్ రెడ్డి.