ఆమె వల్లే హైపర్ ఆది జబర్ధస్త్ మానేశాడా..?

0
1087

బుల్లితెరపై ప్రసారం అవుతున్న జబర్ధస్త్ షో గురించి అందరికీ తెలిసిందే. గతంలో సహ నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆది అదిరే అభి టీమ్ లో చేశాడు. ఆ తర్వాత ఆది సుడి తిరగడంతో హైపర్ ఆది టీం ఏర్పాటు చేసి లీడర్ గా మారాడు. అప్పటి నుంచి ఆయన పంచుల మీద పంచులు వేస్తూ చాలా స్కిట్లను ఒంటిచేత్తో కొట్టారు. ఆయన పంచులు వేస్తే నవ్వని ప్రేక్షకుడు ఉండడంటే సందేహం లేదు.

ఇక యాంకర్లను ఆడుకోవడంలో ఆది తర్వాతే ఎవరైనా అని చెప్పచ్చు. ఎక్కువగా జబర్ధస్త్ లో చేసిన ఆది అనసూయపై పంచులు వేసేవారు. తర్వాత మల్లెమాల ప్రొడక్షన్ లో వస్తున్న కొన్ని షోలలో కూడా హోస్ట్ గా కనిపించారు ఆది. కానీ ఆయనకు జబర్ధస్త్ ఇచ్చినంత ఇమేజ్ ఏ షో ఇవ్వలేకపోయిందనే చెప్పాలి.

ఆది ఉంటేనే షోకు అందం

2013 నుంచి నారాకంటంగా సాగుతున్న జబర్ధస్త్ షో లో యాంకర్లు, జడ్జిలు మారినా రెట్టింపు ఉత్సాహంతో కొనసాగుతోంది. ఇప్పటికీ చాలా మంది కమేడియన్లు షోకు ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. పాత వారికి వెండితెరపై మంచి మంచి అవకాశాలు వస్తుండడంతో వారు వెళ్లిపోవడం కొత్తవారితో టీంను ఫాం చేసి మరిన్ని ఎపీసోడ్లను తేవడం మల్లెమాలకు కొత్తేమి కాదు.

ఇటీవల సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ సినిమా కోసం జబర్ధస్త్ ను విడిచివెళ్లిపోయి మళ్లీ తిరిగి వస్తానంటూ ప్రకటించారు. ఇక ఆది కూడా కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూనే ఉన్నారు. సినిమాల్లో కూడా ఆయన వేసే పంచులను చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు.

వివాదాలను ఎదుర్కొన్న ఆది

హైపర్ ఆది పంచులతో జబర్ధస్త్ చాలా వివాదాలను ఎదుర్కొంది. యాంకర్ చుట్టూ ఆయన వేసే పంచులపై నెటిజన్ల నుంచి సాధారణ ప్రేక్షకుడి వరకూ ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు లేకపోలేదు. ఇటీవల అనసూయ జబర్ధస్త్ నుంచి వెళ్లిపోవడంతో ఆమె స్థానంలో కన్నడ యాంకర్ సౌమ్యారావు వచ్చారు. వచ్చీ రావడంతోనే ఆమెతో ఆడుకున్నాడు హైపర్ ఆది. అయితే కొన్ని రోజులుగా ఆయన కనిపించడం లేదు. జబర్ధస్త్ ను వీడాడని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. ఎందుకో..? అనే విషయాలు తెలియకున్నా. కొత్త యాంకర్ సౌమ్యారావు వల్లే అంటూ వార్తలు తెరపైకి వస్తున్నాయి.

జబర్ధస్త్ మానేసేందుకు కారణం

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ప్రోమో ఒకటి విడుదల చేసింది మల్లెమాల టీం. అందులో ఆది అన్న మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తాను జబర్ధస్త్ ను వీడేందుకు కారణాలను ఆయన చెప్పినట్లు ప్రోమోలో కనిపిస్తుంది. సంక్రాంతి శుభాకాంక్షలు కాన్సెప్ట్ తో వస్తున్న ఈ ఎపీసోడ్ కు సంబంధించి దాదాపు మూడున్నర నిమిషాల ప్రోమో రిలీల్ చేయగా రష్మీ, హైపర్ ఆదిని కొన్ని ప్రశ్నలు అడుగుతుంది.

రష్మీ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ

ఇందులో భాగంగానే జబర్ధస్త్ మానేసేందుకు కారణం అడుగగా.. యాంకర్ సౌమ్యారావుతో పాటు మరో ఇద్దరి ఫొటోలను స్క్రీన్ పై చూపించారు. ఈ ప్రశ్నకు హైపర్ ఆది స్పందిస్తూ తాను జబర్ధస్త్ మానేసేందుకు కారణం యాంకర్ సౌమ్యారావు అని ఆది అన్నారు. దీంతో జడ్జి ఇంద్రజతో పాటు సెట్ లో ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. దీనిపై పూర్తి క్లారిటీ రావాలంటే మాత్రం ఎపీసోడ్ టెలీకాస్ట్ అయ్యే వరకు ఆగాల్సిందే.