తమలపాకు వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయా?

0
400

మన హిందూ సంప్రాదాయ ప్రకారం తమలపాకు ని ఎన్నో సందర్భాల్లో, సామాజిక ఆచారాలతో ఉపయోగిస్తూ ఉంటారు. అయితే తమలపాకు వల్ల ఆరోగ్యానికి ఎన్ని లాభాలు చేకూరుతాయో ప్రముఖ బొకారో కి చెందిన ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు రాజేష్ పాఠక్ తెలిపాడు. తమలపాకు లోని అద్భుతమైన గుణాలను వివరిస్తూ ఆయన చేసిన కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఈ తమలపాకు వాడడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు దూరం అవ్వడమే కాకుండా, వ్యాధులతో పోరాడే శక్తిని వస్తుంది. ముఖ్యంగా తమలపాకు మన శరీరం లోని జీర్ణ వ్యవస్థని మెరుగు పర్చడానికి చాలా తోడ్పడుతుంది. అంతే కాదు ముఖ వాపుని కూడా తమలపాకు ని ఉపయోగించి నయం చెయ్యవచ్చని రాజేష్ పాఠక్ ఈ సందర్భంగా తెలిపాడు. ప్రతీ రోజు నిద్ర లేవగానే ఒకసారి, అలాగే సాయంత్రం సమయం లో మరోసారి తమలపాకు ని నమలడం వల్ల జీర్ణ వ్యవస్థ చాలా మెరుగ్గా పని చేస్తుందట.

40 ఏళ్ళు దాటిన వారికి మోకాళ్ళు మరియు కీళ్ల నొప్పులు చాలా తీవ్రంగా ఉంటాయి. అలాంటి వాళ్ళు తమలపాకు ని మెత్తగా రుబ్బి, గోరువెచ్చని నీళ్ళల్లో కలిపి త్రాగితే చాలా వరకు ఉపశమనం కలిగే అవకాశం ఉందట. ఇది ఇలా ఉండగా నాన్ వెజ్ బాగా తినే వారికి శరీరం లో యూరిక్ యాసిడ్ ఊహించిన దానికంటే ఎక్కువ ఏర్పడుతుంది.

తమలపాకు ని తినడం బాగా అలవాటు చేసుకుంటే యూరిక్ యాసిడ్ వల్ల కలిగే నొప్పుల నుండి దూరం అవ్వొచ్చు. అంతే కాదు తమలపాకు ని ఉపయోగించడం వల్ల మన కంటి చూపు కూడా చాలా మెరుగు పడుతుందట. అంతే కాదు ఆకుల్లో ఉండే పదార్దాలు శరీరం లో హార్మోన్లలో సమతూల్యత పెంచడం లో సహాయపడుతాయి.

ముఖ్యంగా మహిళలలో హార్మోన్ల సమతూల్యత చాలా అవసరం. పిల్లలను ప్రసవించేందుకు వారిలో చాలా శక్తి కావాల్సి ఉంటుంది. ఈ తమలపాకులను ప్రతీ రోజు ఉదయం మరియు సాయంత్రం ఉపయోగించడం వల్ల, వారి శరీరం లో నూతన శక్తిని ఉద్బవించేలా చేస్తుంది. అంతే కాకుండా వారిలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇక ఆలస్యం చెయ్యకుండా ప్రతీ రోజు తమలపాకు ని ఉపయోగించి ఒకసారి చూడండి. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవని డాక్టర్లు చెప్తున్నారు.