అనకాపల్లి జనసేన ఎంపీ అభ్యర్ధిగా కొణతల?

0
172
Konathala as Anakapalli Janasena MP candidate
Konathala as Anakapalli Janasena MP candidate

ఏపీ రాజకీయాల్లో తెలుగుదేశం`జనసేన కూటమి కాకరేపుతోంది. అధికార వైసీపీకి రాంరాం చెపుతున్న నేతలతో, ఇతర నాయకుల చేరికలతో మంచి జోష్‌ మీద ఉంది ఈ కూటమి.

ఇందులోనూ టీడీపీకి అన్ని నియోజకవర్గాల్లోనూ ఆశావహులు చాలామంది బరిలోకి వస్తుండడంతో అక్కడ స్థానం లేని వారు జనసేనకు పొత్తులో భాగంగా వచ్చే స్థానాల్లో పోటీ చేయటానికి టికెట్‌ కోసం పవన్‌ కళ్యాణ్‌కు టచ్‌లోకి వెళుతున్నారు.

అన్ని సక్రమంగా జరిగితే జనసేనలో చేరి, ఆపై పోటీకి సిద్ధమౌతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. తాజాగా ఉత్తరాంధ్రకు చెందిన సీనియర్‌ నాయకులు కొణతల రామకృష్ణ ఈరోజు పవన్‌ కల్యాణ్‌ను హైదరాబాద్‌లో కలిశారు.

ఈ సందర్భంగా అనేక రాజకీయ అంశాలపై చర్చించినట్టు సమాచారం. అయితే ఇదే భేటీలో అనకాపల్లి పార్లమెంట్‌ స్థానం నుంచి తాను పోటీ చేయటానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన పవన్‌కు విన్నవించుకున్నట్లు తెలుస్తోంది.

పొత్తులో భాగంగా విశాఖ పార్లమెంట్‌ నుంచి టీడీపీ, అనకాపల్లి నుంచి జనసేన పోటీ చేసేలా పవన్‌, చంద్రబాబుల మధ్య ఒప్పందం కుదిరినట్టు తెలుస్తోంది. అందుకే కొణతల జనసేనలో జాయిన్‌ అయి అనకాపల్లి పార్లమెంట్‌ నుంచి పోటీ చేస్తారట.

Chandrababus political future in Trishanku Swarga
Chandrababus political future in Trishanku Swarga

సుధీర్ఘకాలం కాంగ్రెస్‌లో కొనసాగిన కొణతల ఉత్తరాంధ్రలో మంచి పట్టున్న నాయకుడు. వైఎస్సార్‌కు సన్నిహితుడు కూడా, వైఎస్సార్‌ మరణానంతరం జగన్‌ స్థాపించిన వైఎస్సార్‌ సీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఈయన కూడా ఒకరు.

అప్పట్లో జగన్‌కు అత్యంత సన్నిహితుల్లో ఒకరుగా ఉన్న కొణతాల 2014 ఎన్నికల అనంతరం జగన్‌కు దూరం జరిగారు. 2014 ఎన్నికల్లో జగన్‌ తన తల్లి విజయమ్మను విశాఖ పార్లమెంట్‌ నుంచి నిలబెట్టినప్పుడు..

ఇది మంచి నిర్ణయం కాదని, విశాఖలో నార్త్‌ ఇండియాకు చెందిన వారి ఓటింగ్‌ భారీగా ఉందని, ఈ ఎన్నికల్లో మోడీ ప్రభావం బాగా ఉందని, కాబట్టి మీ తల్లిగారు ఓడిపోయే అవకాశం ఉందని కొణతల హెచ్చరించడంతో,

అది మింగుడుపడని జగన్‌ను ఆయన్ను అప్పటి నుంచి దూరం పెడుతూ వచ్చారని, ఇది గ్రహించిన కొణతల తానే జగన్‌కు దూరం జరిగారని అంటారు. తాజాగా కొణతల పవన్‌ కలవడం,

మళ్లీ రాజకీయంగా యాక్టివ్‌ కావడం ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలకు తెరతీసే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పవచ్చు.