బియ్యం పంపిణీ వాహనాల వెనుక వ్యూహం అదేనా

0
625

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌లో సంక్షేమ రాజ్యం నాలుగు పాదాల నడుస్తోందని వైసీపీ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఇదే సమయంలో లెక్కకు మిక్కిలి అప్పులు చేస్తూ అలవికాని పథకాలను అమలు పరుస్తూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రభుత్వం ప్రవేశం పెడుతున్న ప్రతి పథకం లబ్ధిదారులకు డైరెక్ట్‌గా మేలు చేసేదిగా ఉండేలా వీలైనన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాంటే ఇప్పటి వరకూ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఈ విధమైన పథకాల అమలు కార్యాచరణను ఏ ప్రభుత్వం కూడా చేయలేదు.

తాజాగా ముఖ్యమంత్రి చేతులు మీదుగా ఇంటింటికీ రేషన్‌ బియ్యం పంపిణీ కోసం దాదాపు 10వేల వాహనాలను ప్రారంభించారు. విజయవాడలోని బెంజిసర్కిల్‌లోని బందరు రోడ్డు నుంచి ఈ వాహనాలు వేలాదిగా రయ్‌ మంటూ దూసుకు పోవడం చూసిన ప్రజలు సైతం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రతి పక్షాలు మాత్రం ఇదంతా దుబారా వ్యవహారమంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఈ పథకాన్ని నిశితంగా పరిశీలిస్తే ప్రభుత్వం ఈ డోర్‌ డెలివరీని ఉపయోగించుకుని అసలైన లబ్ధి దారులకు మేలు చేయడం, అనవసరమైన వారిని ఏరి వేయడం అనే రెండు లక్ష్యాలను పక్కాగా నిర్ధేశించుకున్నట్లుగా కనపడుతోంది. ప్రస్తుతం ఉన్న విధానంలో రేషన్‌ కార్డు ఉన్న వారు తమకు కేటాయించిన దుకాణాలకు వెళ్లి బియ్యం తెచ్చుకుంటున్నారు. ఈ తరహా 70 శాతం మాత్రమే ఉంటున్నారు. మిగిలిన 30 శాతం వారు బహుళ అంతస్తుల మేడలు నిర్మించుకుని, సమాజంలో మంచి హోదా కలిగి, అర్హత లేక పోయినా త్లె కార్డు దాబ్ధిదారులుగా చెలామణి అవుతున్నారు.

వీరికి సంబంధించిన కార్డు వేలి ముద్రలు డీలర్లు తాపీగా సేకరించి వారి బియ్యాన్ని అమ్ముకుంటున్నారు. ఈ లబ్ధిదారులకు బియ్యంతో పనిలేదు.. త్లెల్ల కార్డు ఉంటే చాలు అన్నట్లుగా డీలర్లకు సహకరిస్తున్నారు. తాజా విధానంతో ఇంటి వద్దకే బియ్యం పంపిణీ వాహనం వచ్చినప్పుడు త్లెల్ల కార్డు దారులు తప్పని సరిగా వాహనం వద్దకు రావాలి. మేడలు, మిద్దెల్లో ఉన్న సోకాల్డ్‌ లబ్ధిదారులు ఈ వాహనాల వద్దకు వచ్చి తాము త్లెల్ల కార్డు దారులమని చెప్పుకోవటానికి ఇష్ట పడక పోవచ్చు. తద్వారా భారీ స్థాయిలోనే బియ్యం ప్రభుత్వానికి ఆదా అవుతాయనేది ప్రభుత్వ ఆలోచన. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నమాట.