వైసీపీ గ్రాఫ్‌ పెంచుతున్న ‘సంక్షేమ రథాల’ లాంగ్‌ మార్చ్‌

0
408

అధికారంలోకి రావడానికి పార్టీలు ఎన్ని తిప్పలు పడతాయో.. అలాగే అందిన అధికారాన్ని నిబెట్టుకుంటానికి అంతకంటే ఎక్కువగానే ఆలోచనలు చేస్తుంటాయి. తమ ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు చేరవేయడానికి సహజంగా మీడియాను నమ్ముకుంటాయి ప్రభుత్వాలు వీటి ద్వారా తమ పథకాలను ప్రసారం చేస్తూ ప్రజల దగ్గర మార్కు కొట్టేయడానికి చూస్తాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో వై.యస్‌. జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రచారం విషయంలో మరో అడుగు ముందుకేసింది. రాష్ట్రంలో మేజర్‌ మీడియా టీడీపీకి మద్దతుగా ఉంటుందన్నది అందరికీ తెలిసిందే.

అందుకే మీడియాతో పాటు డైరెక్ట్‌గా ప్రజల్లో చర్చకు దారి తీసేలా వేసిన ప్లాన్‌ సూపర్‌ సక్సెస్‌ అయింది.
సంక్షేమ ఫలాల పంపిణీలో నూతన ఒరవడిని తీసుకువస్తూ వైసీపీ ప్రభుత్వం వేల సంఖ్యలో డోర్‌డెలివరీ వాహనాలును కొనుగోలు చేసింది. ఓ వైపు నిరుద్యోగులకు ఆసరాగా ఉండటం, మరోవైపు లబ్ధి దారుల ముంగిటకే సంక్షేమ ఫలాలు మోసుకుపోవడం, ఇటు ప్రభుత్వానికి పబ్లిసిటీ పరంగా హైప్‌ రావడం అనే మూడంచెలతో ఈ రథాల కాన్సెప్ట్‌ను తెరమీదకు తెచ్చారు.

ఇందులో భాగంగా వేలాది వాహనాలు గుజరాత్‌ నుంచి రాష్ట్రానికి కొద్ది రోజుల కిందటే చేరుకున్నాయి. వీటికి అవసరమైన అదనపు హంగులను జోడిరచే కార్యక్రమాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ వేలాది వాహనాలు వివిధ జిల్లాలకు, మండలాలకు, గ్రామాలకు చేరుకున్నాయి. రోడ్డు మార్గంలో వెళుతున్న ఈ వాహనాలను చూసి ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్లాన్‌ సక్సెస్‌ కావడంతో ఈ వాహనాలను ఆయా పట్టణాలు, గ్రామాల్లో అటూ ఇటూ తిప్పుతూ మంచి ప్రజల నుంచి మైలేజ్‌ను పొందుతోంది ప్రభుత్వం. మీడియా అండ లేకపోతే ఏమిటి.. ప్రజల ముంగిటకే ప్రభుత్వం తన పథకాలను తీసుకు వెళ్లేలా వినూత్నంగా చేసిన ప్లాన్‌ అదిరిపోయింది కదూ.